LPG E-KYC: ఎల్‌పీజీ ఇ-కేవైసీకి ఇవాళే లాస్ట్ డేట్.. పూర్తి చేశారా? లేదంటే కనెక్షన్ కట్.. గ్యాస్ ఏజెన్సీల హెచ్చరిక!
LPG (LPG E-KYC)గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశం కల్పించింది.
- V Santhosh Kumar
- Published on- September 14, 2026 / 05:14 PM IST
Deadline for LPG gas connection KYC ends on September 14.
- సెప్టెంబర్ 14 ఇ-కేవైసీ గడువు
- ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరం
- గ్రామీణుల రీఫిల్ వెయిటింగ్ తగ్గింపు
LPG E-KYC: LPG గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశం కల్పించింది. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ వినియోగదారులు తమ కనెక్షన్‌కు ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ (LPG E-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 14 వరకు తుది గడువు పొడిగించారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే వంటగ్యాస్ సబ్సిడీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Telangana Rain: తెలంగాణకు వర్ష ముప్పు.. హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
గడువులోగా పూర్తి చేయకపోతే ఏమవుతుంది?
సెప్టెంబర్ 14 లోగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారుల కనెక్షన్ల సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశముందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే, కనెక్షన్లు పూర్తిగా రద్దవుతాయా లేదా కమర్షియల్ రేట్లు వర్తిస్తాయా అనే దానిపై స్పష్టమైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వినియోగదారులు తమ స్థానిక గ్యాస్ ఏజెన్సీని సందర్శించి లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ యాప్స్ ద్వారా ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
గ్రామీణ వినియోగదారులకు బిగ్ రిలీఫ్!
మరోవైపు గ్రామీణ ప్రాంత గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉన్న 45 రోజుల వేచి ఉండే సమయాన్ని 25 రోజులకు తగ్గించారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 25 రోజుల నిబంధన అమలులో ఉండగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరఫరా మెరుగవ్వడంతో ఈ కొత్త నియమాన్ని అందుబాటులోకి తెచ్చారు.
