Amazon Prime Day Sale : కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో డెల్ ఏలియన్‌వేర్ M16 సేల్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Amazon Prime Day Sale : అమెజాన్ రాబోయే ప్రైమ్ డే సేల్ సందర్భంగా డెల్ (Dell Alienware m16 AMD) ఎడిషన్‌ ల్యాప్‌టాప్ లాంచ్ చేస్తుంది. జూలై 15 నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూలై 16తో ముగుస్తుంది.

Dell to launch Alienware m16 AMD edition during Amazon Prime Day sale, price starts from Rs 1,92,990

Amazon Prime Day Sale : కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అన్ని గాడ్జెట్‌లపై ఆకట్టుకునే డీల్స్‌ అమెజాన్ అందించనుంది. ఈ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 నుంచి iQOO నియో 7 ప్రో వరకు అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌లపై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో చాలా గాడ్జెట్‌లు లాంచ్ కానున్నాయి. AMD ద్వారా ఆధారితమైన డెల్ (Alienware m16) వాటిలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సేల్ సమయంలో డెల్ ఏలియన్‌వేర్ m16ని లాంచ్ చేయనుంది.

భారత మార్కెట్లో (Dell Technologies), (Alienware) భాగస్వామ్యంతో Alienware m16 గేమింగ్ ల్యాప్‌టాప్ రెండు AMD వేరియంట్‌లను ప్రకటించాయి. జూలై 15న ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌లు జూలై 16 వరకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. Alienware m16 AMD ఎడిషన్ బేస్ వేరియంట్ ధర రూ.1,92,990 ఉండనుంది. మరోవైపు హై-ఎండ్ వేరియంట్ ధర రూ.2,99,990 ఉండవచ్చు.

డెల్ టెక్నాలజీస్, ఇండియాలోని ప్రొడక్ట్ మార్కెటింగ్, కన్స్యూమర్ అండ్ స్మాల్ బిజినెస్ డైరెక్టర్ పూజన్ చద్దా మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేసిన గేమింగ్ డివైజ్‌లు అద్భుతమైన విజయాన్ని అందించాయి. Alienware m16 AMD ఎడిషన్ కూడా అదే ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. పనితీరు, వ్యక్తిగతీకరణ, హై ఎండ్ వెర్షన్ల కోసం చూస్తున్న గేమర్‌లకు ఇన్-క్లాస్ గేమింగ్ డివైజ్‌గా ఉపయోగపడనుంది’ అని చద్దా అభిప్రాయపడ్డారు.

Amazon Prime Day Sale : Dell to launch Alienware m16 AMD edition during Amazon Prime Day sale, price starts from Rs 1,92,990

ఏలియన్‌వేర్ m16 AMD ఎడిషన్ టాప్ స్పెక్స్ ఇవే :
కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ (Alienware m16) AMD Ryzen 7000H సిరీస్ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. గ్రాఫిక్ కార్డ్‌ల విషయానికి వస్తే.. ల్యాప్‌టాప్‌లు NVIDIA GeForce RTX 4080 GPU వరకు ఉంటాయి. లేటెస్ట్ ప్రాసెసర్‌లు, గ్రాఫిక్ కార్డ్‌లతో ల్యాప్‌టాప్ రెండు వేరియంట్‌లు పనితీరు అద్భుతంగా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. అన్నింటిని కలిగిన గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. అదనంగా, Alienware m16 ల్యాప్‌టాప్ గరిష్టంగా 480Hz రిఫ్రెష్ రేట్‌తో 16:10 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

వినియోగదారులు 165Hz రిఫ్రెష్ రేట్‌ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ల్యాప్‌టాప్ లెజెండ్ 3.0 డిజైన్‌తో వస్తుంది. సుదీర్ఘ గేమ్‌ప్లే సెషన్‌లలో విస్తృతంగా ఏలియన్‌వేర్ క్రయో-టెక్ థర్మల్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. ఇంకా, ఏలియన్‌వేర్ కమాండ్ సెంటర్ 6.0 గేమర్లకు గేమ్‌ప్లే సెట్టింగ్‌పై మరింత కంట్రోల్ అందించేలా ఉంటుంది. గేమ్‌ప్లే సెట్టింగ్‌ల విషయానికి వస్తే.. గేమర్లు ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉండవచ్చు. గేమింగ్ అవసరాలకు బాగా సరిపోయేలా ఎంచుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లు డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్‌తో కూడా రానున్నాయి.

Read Also : Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ అద్భుతమైన ఫీట్.. 5 మిలియన్ యూనిట్ల మైలురాయిని దాటేసింది..!

ట్రెండింగ్ వార్తలు