Gold and silver Price: ఇవాళ ధన త్రయోదశి.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : October 29, 2024 / 11:23 AM IST
Gold Rate
Gold and Silver Price Today: దేశవ్యాప్తంగా హిందువులు ఇవాళ ధన త్రయోదశి పండుగను జరుపుకుంటున్నారు. దీంతో బంగారం, వెండి, ఆభరణాలను కొనుగోలు చేస్తే ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి వాటి ధరలు షాకిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.650 పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.80,450 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,900 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 80,600.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.73,750 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 80,450.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,750 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
మంగళవారం వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,06,900 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,06,900.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 99,000.
బెంగళూరులో కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 99,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
