Tata Car Discounts 2023 : ఈ డిసెంబర్‌లో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. సఫారి టు టిగోర్‌ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు!

Tata Car Discounts 2023 : టాటా మోటార్స్ డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన కార్లపై రూ. 1.40 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది.

Tata Car Discounts 2023 : ఈ డిసెంబర్‌లో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. సఫారి టు టిగోర్‌ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు!

Discounts of up to Rs 1.40 lakh on Tata Harrier, Safari, Altroz, Tiago, Tigor in December 2023

Tata Car Discounts 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీ.. ఈ డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన కొన్ని కార్లపై రూ. 1.40 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు డిసెంబర్ 31, 2023 వరకు టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్‌‌లపై కార్పొరేట్ డిస్కౌంట్లు, క్యాష్ డిస్కౌంట్లతో పాటు మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా అందించే కచ్చితమైన తగ్గింపు గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Buy New Car 2024 : వచ్చే జనవరిలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీగా పెరగనున్న కార్ల ధరలు!

టాటా సఫారి – రూ. 1.40 లక్షల వరకు :
టాటా సఫారిపై భారీ తగ్గింపు అందిస్తుండగా.. ఈ నెలలో టాటా సఫారిపై గరిష్టంగా రూ. 1.40 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. సఫారి మాన్యువల్, ఆటోమేటిక్, ఏడీఏఎస్ వేరియంట్‌లపై రూ. 50వేల నుంచి రూ. 75వేల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 25వేల నుంచి రూ. 50వేల వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు, రూ. 15వేల కార్పొరేట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా హారియర్ – రూ. 1.35 లక్షల వరకు :
ఆసక్తిగల వినియోగదారులు డిసెంబర్ 2023లో టాటా హారియర్‌పై రూ. 1.35 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్ పొందవచ్చు. టాటా మోటార్స్ ఈ హారియర్ కారుపై రూ. 50వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల నుంచి రూ. 50వేల విలువైన ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రస్తుత జెన్‌పై రూ. 10వేల అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

టాటా టియాగో, టిగోర్ – రూ. 80వేల వరకు తగ్గింపు :
కస్టమర్‌లు టాటా వేరియంట్లపై ఆధారపడి రూ. 30వేల నుంచి రూ. 60వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 15వేల విలువైన ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, టాటా టియాగోపై రూ. 5వేల కార్పొరేట్ డిస్కౌంట్‌తో పాటు మొత్తం డిస్కౌంట్లను రూ. 80వేల వరకు పొందవచ్చు.

Discounts of up to Rs 1.40 lakh on Tata Harrier, Safari, Altroz, Tiago, Tigor in December 2023

Tata Harrier, Safari, Altroz, Tiago, Tigor

టాటా నెక్సాన్ (ప్రస్తుత జనరేషన్) – రూ. 70వేల వరకు :
టాటా నెక్సాన్ మాన్యువల్ పెట్రోల్, ఏఎంటీ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లపై రూ. 20వేల నుంచి రూ. 40వేల క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, డిసెంబర్ 2023లో రూ. 20వేల విలువైన ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు, రూ. 5వేల కార్పొరేట్ బెనిఫిట్స్ రూ. 10వేల వరకు పొందవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ – రూ. 45,000 వరకు :
టాటా ఆల్ట్రోజ్ డీజిల్, సిఎన్‌జి, పెట్రోల్ (ఎంటి), డిసీఎ వేరియంట్‌లు ఈ నెలలో రూ. 45వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్‌లు డిసెంబర్ 31, 2023 వరకు టాటా ఆల్ట్రోజ్‌పై రూ. 10వేల నుంచి రూ. 30వేల విలువైన క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 10వేల నుంచి రూ. 25వేల మధ్య ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లతో పాటు రూ. 5వేల కార్పొరేట్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Car Insurance Policy Tips : మిగ్‌జామ్ తుఫాను ఎఫెక్ట్ : మీ కారు వరదల్లో కొట్టుకుపోయి పాడైపోయిందా? బీమా పాలసీ టిప్స్ మీకోసం..!