Buy New Car 2024 : వచ్చే జనవరిలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీగా పెరగనున్న కార్ల ధరలు!

Buy New Car 2024 : జనవరిలో కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, హోండా, ఎంజీ కార్లు జనవరి నుంచి మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.

Buy New Car 2024 : వచ్చే జనవరిలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీగా పెరగనున్న కార్ల ధరలు!

Planning to buy a new car in January_ Get ready to pay more

Buy New Car 2024 : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి బ్యాడ్ న్యూస్.. 2023 ఏడాది ముగియనుంది. మరికొద్ది రోజుల్లో 2024 కొత్త సంవత్సరం రాబోతోంది. వచ్చే జనవరిలో ఆటో మొబైల్ తయారీ కంపెనీలు తమ కార్ల ధరలను భారీగా పెంచనున్నాయి. ఇప్పటికే, మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి కార్ల తయారీదారులు వచ్చే నెల నుంచి తమ కార్ల మోడళ్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించారు.

Read Also : New Car Buying Guide : కొత్త కారు కొంటున్నారా? కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!

కార్ల మోడల్ ఆధారంగా ధరల పెంపు :
మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుతున్న కమోడిటీ ధరల కారణంగా పెరిగిన ధరల ఒత్తిడి నేపథ్యంలో కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. ఏదేమైనప్పటికీ, ఏ కార్ల తయారీ కంపెనీ ఎంత మొత్తంలో ధరలను పెంచనుందో క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి మోడల్‌పై ధరల పెంపు ఎంత అనేది కంపెనీలు ప్రకటించలేదు. కార్ల మోడల్‌ ఆధారంగా ధరల పెరుగుదల మారే అవకాశం ఉంది. సాధారణంగా, కార్ల తయారీదారులు ఇప్పుడు తమ వాహనాల ధరలను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతున్నారు.

Planning to buy a new car in January_ Get ready to pay more

Planning to buy a new car in January_ Get ready to pay more

ధరల పెంపునకు ద్రవ్యోల్బణమే కారణమా? :
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి తమ వాహనాల సగటు విక్రయ ధర క్యూ2 ఎఫ్‌వై23లో రూ. 5,51,677 నుంచి క్యూ2 ఎఫ్‌వై 24లో 16.7శాతం పెరిగి రూ.6,43,688కి చేరుకుంది. అధికారిక ప్రకటనలో మారుతి తన కార్ల ధరలను జనవరి 2024లో పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుదలను భర్తీ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అది మార్కెట్‌కు కొంత పెరుగుదలను అందించనుంది.

జనవరి 1 నుంచి ధరల పెంపు అమల్లోకి :
భారత మార్కెట్లో జనవరి 16న కొత్త క్రెటాను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ కంపెనీ కూడా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ప్రతికూల మారకపు రేట్లు, వస్తువుల ధరల పెరుగుదల వంటి ఇతర కారణాల వల్ల జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను భారీగా పెంచనున్నట్టు ప్రకటించింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ‘మా కంపెనీలో ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు ధరల పెరుగుదలను కస్టమర్లకు అనుగుణంగా ఉండేలా ప్రయత్నిస్తాం. అయితే, పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలో కొంత భాగాన్ని పెంచడం ఇప్పుడు అత్యవసరం. ధరల పెరుగుదల ద్వారా కార్ల మార్కెట్‌ పుంజుకుంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Planning to buy a new car in January_ Get ready to pay more

buy a new car in January 

మరోవైపు.. మహీంద్రా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (ఎస్‌యూవీలు), వాణిజ్య వాహనాల (సీవీలు) ధరలను కూడా జనవరి నుంచి పెంచనుంది. మహీంద్రా ఈ అదనపు ఖర్చులను వీలైనంత ఎక్కువగా స్వీకరించడానికి ప్రయత్నాలు చేసింది. అయితే, ఈ పెరుగుదలలో కొంత భాగాన్ని వినియోగదారులపై భారం మోపనుంది. ధరల పెరుగుదల వివిధ ఎస్‌యూవీలు, సీవీలలో మారుతూ ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also : Best Phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ డిసెంబర్‌లో రూ.50 వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!