Best Electric Scooters : పండక్కీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? రూ.1 లక్షలోపు టాప్ 5 ఈవీ స్కూటర్లు ఇవే.. 179 కి.మీ రేంజ్
Best Electric Scooters : ఈసారి దీపావళి పండగ సందర్భంగా రూ.1 లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి బంపర్ ఆఫర్లు.. ఓలా S1 Z, విడా VX2 Go, బజాజ్ చేతక్ సహా టాప్ 5 ఈవీల ధరలు, రేంజ్, ఫీచర్ల వివరాలివే..
- Sreehari A
- Updated on- October 16, 2026 / 11:58 AM IST
Electric Scooters Under 1 Lakh
- రూ.1 లక్షలోపు 179 కి.మీ రేంజ్ ఇచ్చే 5 స్కూటర్లు
- దీపావళి కోసం బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు
- రూ.80 వేల నుంచే ఎలక్ట్రిక్ స్కూటర్..
- ఓలా నుంచి బజాజ్ వరకు టాప్ మోడళ్లు
Diwali 2026 : పండగ సీజన్ వచ్చేసింది.. ఈ దీపావళి పండుగకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పెట్రోల్ ఖర్చులకు చెక్ పెట్టడంతో పాటు బడ్జెట్లోనే మంచి స్కూటర్ సొంతం చేసుకోవాలనుకుంటే ఇంతకన్నా బెస్ట్ టైమ్ ఉండదు.
అయితే, మీకోసం మార్కెట్లో రూ.1 లక్షలోపు ధరకు ఉన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.. అందులో ఓలా, విడా, బజాజ్, ఆంపియర్, ప్యూర్ ఈవీ కంపెనీలకు (Best Electric Scooters) చెందిన ఈ ఎలక్ట్రిక్ మోడళ్లు ధర, రేంజ్, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. ఓలా S1 Z :
బడ్జెట్ ఈవీల్లో ఓలా S1 జెడ్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,999. ఒకసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల వరకు ఐడీసీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
2. విడా VX2 గో 3.4 :
హీరో మోటోకార్ప్కు చెందిన విడా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ 3.4 ధర రూ.95వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 3.4kWh బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఛార్జ్తో 146 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ లభిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు అందిస్తుంది. ఇందులో బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు..
Read Also : SBI Loan Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. రుణ వడ్డీ రేట్ల పెంపు.. భారీగా పెరగనున్న ఈఎంఐలు..!
3. బజాజ్ చేతక్ C2501 :
బజాజ్ చేతక్ C2501 ఎక్స్-షోరూమ్ ధర రూ.99,802 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 2.5kWh బ్యాటరీ, 113 కిలోమీటర్ల రేంజ్ ఉన్నాయి. టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఎకో, స్పోర్ట్స్, టెక్పీక్ రైడింగ్ మోడ్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
4. ఆంపియర్ మాగ్నస్ నియో :
ఆంపియర్ మాగ్నస్ నియో ప్రారంభ ధర రూ.90,999. 125 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, గంటకు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 6 గంటలు పడుతుంది.
5. ప్యూర్ ఈవీ ఎంట్రన్స్ నియో ఎస్ఎక్స్ :
ప్యూర్ ఈవీ ఎంట్రన్స్ నియో ఎస్ఎక్స్ ధర రూ.84,836 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 70 నుంచి 101 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ గంటకు 47 కిలోమీటర్లు అందిస్తుంది.
Note : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు. రేంజ్, రహదారి పరిస్థితులు, వేగం, లోడ్, బ్యాటరీ వినియోగంపై ఆధారపడి మారొచ్చు. కొనుగోలు చేసే ముందు లేటెస్ట్ ధరలు, వారంటీ, అధికారిక డీలర్ వద్ద పూర్తి వివరాలను తెలుసుకోండి..
