×
Ad

Diwali Sale Offers : దీపావళి సేల్ ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Diwali Sale Offers : ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్‌లో రూ. 23వేలు తగ్గింపు పొందింది. ప్రస్తుతం రూ. 56, 490 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.

1/6
Diwali Sale Offers : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ దీపావళి సేల్‌ సందర్భంగా ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కూడా ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇలాంటి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఏడాదిలో ఈ-కామర్స్ సేల్స్ సమయంలో ఆపిల్ ఐఫోన్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది.
2/6
ఈసారి కూడా అంతేస్థాయిలో ఆఫర్లతో వినియోగదారులను ఊరిస్తున్నాయి. గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16 మోడల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో A18 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 రూ.56,490 కన్నా తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్‌లలో ఇదొకటి. ఇంతకీ, ఐఫోన్ 16 తగ్గింపు ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 భారీ తగ్గింపు : ఆపిల్ ఐఫోన్ 16 అసలు ధర రూ.79,900 ఉండగా దీపావళి సేల్ సమయంలో రూ.13,410 ధర తగ్గింది. విజయ్ సేల్స్‌లో బేస్ మోడల్ రూ.66,490కి తగ్గింది. IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కస్టమర్‌లు రూ.10వేల వరకు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
4/6
ఈ అదనపు డిస్కౌంట్ ధర కేవలం రూ.56,490కి తగ్గింది. మొత్తం మీద రూ.23,410 సేవ్ చేయవచ్చు. అంతేకాదు.. విజయ్ సేల్స్ ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే ధరను మరింత తగ్గించవచ్చు.
5/6
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఆపిల్ A18 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 18తో బాక్స్ వెలుపల వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో వస్తుంది. అల్ట్రామెరైన్, టీల్, బ్లాక్, వైట్, పింక్ అనే మొత్తం 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
6/6
డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ఇందులో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 48MP ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. అయితే, 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, ఫేస్‌టైమ్ కాల్స్ యాక్సస్ చేయొచ్చు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3561mAh బ్యాటరీ కలిగి ఉంది.