XChat App : మస్క్ మామ కొత్త యాప్ Xchat వస్తోంది.. ఈ నెల 17నే లాంచ్.. ఫీచర్లు మాత్రం అదుర్స్.. నో యాడ్స్.. నో ట్రాకింగ్..!
XChat App : XChatలో యాడ్స్ లేదా ట్రాకింగ్ ఉండవు. మెసేజింగ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. ఈ యాప్ ఏప్రిల్ 17న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- Sreehari A
- Published On : April 11, 2026 / 08:00 PM IST
XChat App
- యాప్‌కు సిల్వర్ కలర్ చాట్ ఐకాన్
- స్పెషల్ ఫీచర్లన్నింటినీ కూడా వెల్లడించింది
- యాప్ స్టోర్ నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
XChat App : మీరు ఎక్కువగా చాటింగ్ చేస్తుంటారా? అయితే, మీకోసం అతి త్వరలో కొత్త చాట్ యాప్ వస్తోంది. ఎలన్ మస్క్ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ త్వరలో కొత్త చాట్ మెసెంజర్‌ను లాంచ్ చేయనుంది. ప్రత్యేకంగా చాటింగ్ కోసం రూపొందించిన ఈ యాప్‌కు ‘XChat’ అని పేరు పెట్టారు.
ఈ సంస్థ ఇప్పటికే యాప్ కీలక ఫీచర్లన్నింటినీ వెల్లడించింది. స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్లతో ఈ యాప్ ప్రత్యేకంగా చాటింగ్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కోసం ఎక్స్‌చాట్ అనే చాట్ సర్వీస్ యాప్ లాంచ్ కానుంది. ముందుగా iOS యూజర్ల కోసం రిలీజ్ కానుంది. ఆపిల్ అధికారిక టీజర్‌ను కూడా విడుదల చేసింది.
Read Also : Lava Agni 4 : లావా అగ్ని 4పై భారీ డిస్కౌంట్.. 50MP కెమెరా ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్..
ప్రివ్యూ డిజైన్‌లో ఈ యాప్ కోసం ఒక సిల్వర్ కలర్ చాట్ ఐకాన్ కనిపిస్తోంది. ఏప్రిల్ 17న ప్రారంభం కానుంది. యాప్ స్టోర్ నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Your encrypted chats deserve their own app.
Pre-order now: https://t.co/TM8Lk7AMGV pic.twitter.com/ZJ3yROXK1t
— XChat (@chat) April 10, 2026
ఎక్స్ చాట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, ఎడిట్ మెసేజ్‌లతో సహా అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. వివిధ డివైజ్ మధ్య వాయిస్, వీడియో కాల్స్, బారీ గ్రూప్ చాట్‌లు, అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అయితే, ఈ ఫీచర్లన్నీ ఎక్స్‌లో కూడా స్టాండర్డ్ అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్ చాట్ చాటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రైవేట్, సెంట్రలైజడ్ యాప్. ఎక్స్ వేదికగా ఎవరితోనైనా ఈజీగా చాట్ చేసుకోవచ్చు. ఎక్స్ చాట్ ద్వారా యాడ్స్ లేదా ట్రాకింగ్ ఉండవు. మెసేజింగ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. ఈ యాప్ లాంచ్ ముందు ఒక ఏడాదికి పైగా టెస్టింగ్ స్టేజీలో ఉంది. ఎట్టకేలకు ఎలన్ మస్క్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఈ ఎక్స్ చాట్ యాప్ రిలీజ్ చేయనుంది.
