EPFO 3.0 : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఏప్రిల్ 1 నుంచి UPI ద్వారా PF డబ్బులు తీసుకోవచ్చు.. ఎలాగంటే?

EPFO 3.0: ఉద్యోగులకు అద్భుతమైన న్యూస్.. మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. యూపీఐ ఉపయోగించి ఏదైనా ఏటీఎంలో పీఎఫ్ డబ్బులను డ్రా చేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

withdraw PF money ( Image Credit : AI )

  • ఈపీఎఫ్ఓ 3.0తో యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు బ్యాంకు ఖాతాలోకి
  • ఉద్యోగం కోల్పోతే 75శాతం వరకు విత్ డ్రా, మిగిలిన మొత్తం ఎప్పుడైనా..
  • ఈపీఎఫ్ఓ ​​పోర్టల్, UMANG యాప్‌ ద్వారా ఏటీఎంలో డబ్బులు తీయొచ్చు

EPFO 3.0 : పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ డబ్బులు యూపీఐ ద్వారా తీసుకోవచ్చు. పీఎఫ్ విత్ డ్రా ప్రాసెస్ చాలా ఈజీ కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ డబ్బులు విత్ డ్రా విధానంలో భారీ మార్పులను తీసుకువస్తోంది. ఏప్రిల్ 1 నుంచి సరికొత్త ఈపీఎఫ్ఓ ​​3.0 అమల్లోకి రానుంది. ఈ రూల్ ద్వారా పీఎఫ్ సభ్యులు యూపీఐని ఉపయోగించి పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

గతంలో పీఎఫ్ క్లెయిమ్ చేసిన డబ్బులు డిపాటిజ్ అయ్యేందుకు ఎక్కువ రోజులు సమయం పట్టేది. ఈపీఎఫ్ఓ 3.0తో వినియోగదారులు ఈజీగా యూపీఐ ద్వారా PF డబ్బును వెంటనే తమ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలో 75శాతం వరకు డబ్బులు తీయొచ్చు. మిగిలిన మొత్తాన్ని తర్వాత అవసరమైతే వాడుకోవచ్చు.

UMANG యాప్ ఉంటే చాలు :
ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లేదా UMANG యాప్‌‌లో యూపీఐ పిన్ ద్వారా వెరిఫికేషన్ ద్వారా ఏటీఎంలో నుంచి డబ్బులు పొందవచ్చు.

Read Also : Vivo V70 FE : కిర్రాక్ ఫీచర్లతో వివో V70 FE ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh భారీ బ్యాటరీ హైలెట్, ధర మీ బడ్జెట్‌లోనే..?

పీఎఫ్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్ కోసం భారీ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్ బ్యాంకు తీసుకునే సమయం కూడా తగ్గుతుంది. మీరు రిక్వెస్ట్ సమర్పించిన వెంటనే ఇన్‌స్టంట్ క్రెడిట్ ఫీచర్ రియల్ టైమ్ యూపీఐ ద్వారా మీ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి డబ్బు పంపుతుంది.

75శాతం విత్‌డ్రా, ఆపై 25 శాతం కూడా :
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. మీ ఉద్యోగాన్ని కోల్పోతే మీ పీఎఫ్ ఖాతాలోని 75 శాతం వరకు వెంటనే విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం బ్యాలెన్స్ వచ్చే నెల వరకు మీ ఖాతాలోనే ఉంటుంది. అప్పటికీ మీకు ఉద్యోగం లేకపోతే మీ ఖాతాలోని మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఈ 25 శాతం బ్యాలెన్స్ నిబంధన అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారులను ఆదుకుంటుంది.

ముందుగా చెక్ చేయాల్సిన విషయాలివే :
యూపీఐ వాడే ముందు మీ పీఎఫ్ ఖాతా ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

  • మీ UAN యాక్టివేట్ చేసి ఉండాలి.
  • ఆధార్ కార్డు మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉండాలి.
  • మొబైల్ నంబర్, ఆధార్, UPI యాప్ ఖాతాకు లింక్ అయి ఉండాలి.
  • మీ బ్యాంక్ KYC తప్పనిసరిగా అప్‌డేట్ చేసి ఉండాలి.
  • మీ కంపెనీ యజమాని ద్వారా కేవైసీ సహా అన్ని వెరిఫై చేసి ఉండాలి.

యూపీఐతో పీఎఫ్ డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? :

  • ఈ డబ్బును ఏ ఏటీఎం నుంచైనా ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • యూపీఐ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ ఎంచుకుని అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  • మీ యూపీఐ పిన్‌ ఎంటర్ చేసి మీ రిక్వెస్ట్ వెరిఫై చేయండి.
  • మీ డబ్బు బ్యాంక్ అకౌంటులో డిపాజిట్ అవుతుంది.
  • యూపీఐకి సపోర్టు చేసే ఏదైనా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోండి.
  • ఏటీఎం స్క్రీన్‌పై QR క్యాష్ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ కోడ్‌ను స్కాన్ చేసి క్యాష్ విత్‌డ్రా చేసుకోండి.

సామాన్యులకు బెనిఫిట్స్ ఏంటి? :
ఈ కొత్త అప్‌డేట్ రోజువారీ సేవింగ్స్ చేసేవారికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీరు పీఎఫ్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అప్లికేషన్ ఫారాలను నింపాల్సిన పని ఉండదు.
తొందరగా అమౌంట సెటిలిమెంట్ అవుతుంది.

మెడికల్ బిల్లులు లేదా అత్యవసర విషయాలకు డబ్బు చేతికి అందుతుంది. నేరుగా డబ్బులు తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ మోసాలు జరిగే పరిస్థితి ఉండదు. మీ యూపీఐ యాప్‌ల ద్వారా నేరుగా మీ బ్యాలెన్స్, విత్‌డ్రాయల్స్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.