EPFO Big Update : రూ.25 వేల జీతం ఉన్నవారికి పెన్షన్ వస్తుందా? రాదా? ఈపీఎఫ్ఓ రూల్స్ తెలుసుకోండి!

EPFO Big Update : రూ.25 వేల జీతం ఉన్నవారికి పెన్షన్ వస్తుందా? EPS అర్హతలు, 10 ఏళ్ల సర్వీస్ నిబంధన, ముందస్తు పెన్షన్, ఫారం 10C వివరాలు తెలుసుకోండి.

EPFO Big Update

  • పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ న్యూస్..
  • 10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే పెన్షనా?
  • ఉద్యోగం మానేశాక పెన్షన్ వస్తుందా?
  • ఈపీఎఫ్ఓ రూల్స్ తెలుసుకోండి!

EPFO Big Update : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ (EPFO) వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే, ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికీ పెన్షన్ వస్తుందని అనుకోవడం పొరపాటు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు ప్రత్యేక అర్హతలు ఉంటాయి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

రూ.25 వేల జీతం.. పెన్షన్‌కు అర్హులేనా? :
ఈపీఎఫ్, ఈపీఎస్ రెండూ ఉద్యోగుల భవిష్యత్తుకు ఉపయోగపడే స్కీమ్స్ అయినప్పటికీ, వాటి నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఈపీఎస్‌లో సభ్యత్వం పొందడానికి ఉద్యోగి గత సభ్యత్వం, వేతన పరిమితి, ఉద్యోగంలో చేరిన తేదీ వంటి అంశాలు చాలా కీలకం.

Read Also : iQOO Z11xa 5G : సూపర్ ఆఫర్ బ్రో.. రూ.24,998కే ఐక్యూ కొత్త 5G ఫోన్.. ఏకంగా రూ.4వేలు డిస్కౌంట్..!

అందుకే జీతం రూ.25వేలకు పెరిగిందనే కారణంతో ప్రతి ఉద్యోగికీ పెన్షన్ అర్హత వస్తుందని చెప్పలేం. గతంలోనే ఈపీఎస్ సభ్యుడిగా ఉన్న ఉద్యోగి జీతం పెరిగినంత మాత్రాన అతని సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు కాదు. మరోవైపు, హై శాలరీతో కొత్తగా ఈపీఎఫ్ఓలో చేరేవారికి ఈపీఎస్ వర్తింపు నిబంధనలపై స్పష్టత అవసరం.

10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే పెన్షనా? :
ఈపీఎస్ నిబంధనల ప్రకారం.. కనీసం 10 ఏళ్ల అర్హత ఉండి పెన్షన్ సర్వీసు పూర్తి చేసినవారు సాధారణంగా 58 ఏళ్ల వయసు నుంచి నెలవారీ పెన్షన్ పొందవచ్చు. 50 ఏళ్ల తర్వాత అడ్వాన్స్ పెన్షన్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం పెన్షన్ మొత్తం తగ్గుతుంది. 10 ఏళ్ల అర్హత సర్వీసు పూర్తి చేయని సభ్యులు నిర్దేశిత షరతులకు అనుగుణంగా పెన్షన్ విత్‌డ్రా బెనిఫిట్ పొందవచ్చు లేదా స్కీమ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఫారం 10C తప్పనిసరి.

మీ పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీ ఈపీఎఫ్ఓ పాస్‌బుక్‌లో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కనిపిస్తోందని మాత్రమే ఈపీఎస్ సభ్యత్వం ఉన్నట్లు భావించవద్దు. మీ UAN ద్వారా EPFO పోర్టల్‌లో వివరాలు పరిశీలించి, అవసరమైతే కంపెనీ లేదా ఈపీఎఫ్ఓ ఆఫీసును సంప్రదించండి. మీ పెన్షన్ అర్హతను నిర్ణయించేది జీతం ఒక్కటే కాదు.. మీ సభ్యత్వం, సర్వీసు కాలం, వర్తించే నిబంధనలు కూడా అని గమనించాలి.