EPFO Scheme : PF అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.15,000 ఆర్థిక సాయం.. అర్హతలివే..!

EPFO Scheme : ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద కొత్త ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అర్హతలు, నిబంధనలు, రెండు విడతల్లో నగదును పొందవచ్చు. పూర్తి వివరాలివే..

EPFO Good News

  • కొత్తగా ఉద్యోగంలో చేరారా? మీ బ్యాంక్ ఖాతాలో రూ.15 వేలు పడే ఛాన్స్
  • EPFO రూ.15,000 స్కీమ్.. ఎవరికి వర్తిస్తుంది? అర్హతలు ఇవే
  • పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ డబ్బులు అందవు

EPFO Scheme : ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద కొత్త ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అర్హతలు, నిబంధనలు, రెండు విడతల్లో నగదును పొందవచ్చు. పూర్తి వివరాలివే.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15వేల ఆర్థిక సాయం పొందే .కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ డబ్బులు అందవు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? :
ఈ పథకం కింద ఆగస్టు 2025 నుంచి జూలై 31, 2027 మధ్య కొత్తగా ఉద్యోగాల్లో చేరిన అర్హులైన ఉద్యోగులు బెనిఫిట్ పొందవచ్చు. ముఖ్యంగా, ఉద్యోగంలో చేరిన తర్వాత ఈపీఎఫ్ఓ పరిధిలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్లు డిపాజిట్ కావాలి. నెలవారీ జీతం రూ.1 లక్షలోపు ఉండటంతో పాటు నిర్ణీత కాలం పాటు ఉద్యోగంలో కొనసాగడం వంటి నిబంధనలు వర్తిస్తాయి.

Read Also : Flipkart Sale 2026 : వావ్.. వివో T5 ప్రో 5Gపై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొంటే రూ. 14,850 తగ్గింపు..!

రూ.15వేలు ఎలా అందిస్తారు? :
ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15వేల వరకు రెండు విడతల్లో ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుంది. మొదటి విడతగా రూ.7,500, నిర్ణీత సర్వీస్ నిబంధనలు పూర్తయ్యాక రెండో విడతగా మరో రూ.7,500 అందించనున్నారు. ఈ మొత్తం నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో జమ కానుంది.

కంపెనీలకూ ప్రోత్సాహకాలు :
ఈ స్కీమ్ కేవలం ఉద్యోగులకే పరిమితం కాదు. కొత్త ఉద్యోగాలను అందించే సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. అర్హత ఉన్న కొత్త ఉద్యోగుల నియామకాన్ని బట్టి యజమానులకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ స్కీమ్ బెనిఫిట్ పొందాలంటే ముందుగా అర్హత తప్పనిసరిగా ఉండాలి. అర్హత ఉంటే చాలు.. మీ డబ్బులు ఆటోమేటిక్‌గా అందుతాయని భావించకూడదు. అధికారిక ఈపీఎఫ్ఓ లేదా ప్రభుత్వ పోర్టల్‌లో తాజా మార్గదర్శకాలను చెక్ చేయండి.