EPFO Interest Credit : PF ఖాతాదారులకు అలర్ట్.. మీ EPF ఖాతాలో వడ్డీ పడిందా? 2 నిమిషాల్లోనే ఇలా చెక్ చేసుకోండి!
EPFO Interest Credit : 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి పీఎఫ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ జమ అవుతోంది. చాలా మందికి తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలియదు. ఈ ఖాతాదారులలో మీరు ఒకరైతే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- July 25, 2026 / 12:07 PM IST
EPFO Interest Credit
EPFO Interest Credit : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్.. మీ ఖాతాలో పీఎఫ్ వడ్డీ క్రెడిట్ అయిందా? మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? లేదంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల పీఎఫ్ ఖాతాలలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని జమ చేస్తోంది.
ఇప్పటికే చాలామంది ఈపీఎఫ్ఓ సభ్యులకు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ మొత్తం జమ అయింది. మీరు ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జూలై 15 నుంచే పీఎఫ్ వడ్డీ జమ :
ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీని 2026 జూలై 15 నుంచి పీఎఫ్ ఖాతాలకు జమ చేస్తోంది. ఈ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతోంది. అందుకే మీ బ్యాలెన్స్ అప్‌డేట్ అయిందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
ఈపీఎఫ్ఓలో వడ్డీ క్రెడిట్ స్టేటస్ చెకింగ్ ఎలా? :
- ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.
- మీ మొబైల్‌లో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- EPFOలో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
- బ్యాలెన్స్ లేదా వడ్డీ వివరాల కోసం సర్వీస్ డైరెక్టరీ ఆప్షన్‌కు వెళ్లి EPFO ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు ‘View Passbook’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- UAN నెంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది
- ఆ తర్వాత OTP ఎంటర్ చేయండి. బ్యాలెన్స్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ :
- మీ మొబైల్ నంబర్ UANతో రిజిస్టర్ అయి ఉండాలి.
- మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
- మీ PF బ్యాలెన్స్ ఎంతో ఉందో తెలుసుకోవచ్చు.
- మీ ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా మీ UANతో లింక్ అయి ఉండాలి.
SMS ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ :
- మీ UANకు లింక్ చేసిన మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి.
- 7738299899 నంబర్‌కు “EPFOHO UAN ENG” అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.
- ఈపీఎఫ్ఓ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ నుంచే ఈ మెసేజ్ పంపాలి
- మీ ఫోన్‌కు పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది.
ఇ-పాస్‌బుక్ చెకింగ్ ఎలా? :
- ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మీ పాస్‌బుక్‌ను చెక్ చేసుకోండి
- ముందుగా పీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లండి
- మీ UAN, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- ‘Members Passbook’ సెక్షన్‌కు వెళ్లండి.
- పాస్‌బుక్ లైట్ ఆప్షన్ ఓపెన్ చేయండి.
మీరు జాయినింగ్, ఎగ్జిట్ బ్యాలెన్స్ ఉద్యోగి, యజమాని షేరింగ్, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, వడ్డీకి సంబంధించిన పూర్తి వివరాలను చూడొచ్చు. వడ్డీ క్రెడిట్ అయితే అది పాస్‌బుక్‌లోనే కనిపిస్తుంది. ప్రతి నెలా రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగానే ఈపీఎఫ్ఓ వడ్డీని లెక్కిస్తుంది. మీ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై సంవత్సరానికి 8.25 శాతం చొప్పున వడ్డీ అందిస్తుంది.
పీఎఫ్ వడ్డీ ఆలస్యమైతే నష్టమా? :
లేదు. మీ ఖాతాకు వడ్డీ ఆలస్యంగా క్రెడిట్ అయినా మీకు ఎలాంటి నష్టం జరగదు. 1952 నాటి ఈపీఎఫ్ పథకంలోని పేరా 60 ప్రకారం.. ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతాకు వడ్డీ జమ అయినప్పటికీ ప్రతి నెలా బ్యాలెన్స్ ఆధారంగానే లెక్కిస్తారు. అంటే.. ఈపీఎఫ్ఓ ప్రతి నెలా జమ అయ్యే బ్యాలెన్స్‌కు వడ్డీ కలిపి సంవత్సరం చివరిలో ఖాతాకు జమ అవుతుంది. అందుకే వడ్డీ ఆలస్యమైనప్పటికీ, ప్రకటించిన రేటు ప్రకారమే పూర్తి వడ్డీ అందుతుంది.
