EPFO WhatsApp channel : PF సభ్యులకు గుడ్‌న్యూస్.. ఇక ముఖ్యమైన అప్‌డేట్స్ వాట్సాప్‌లోనే.. ఇప్పుడే ఛానల్ ఫాలో అవ్వండి!

EPFO WhatsApp Channel : పీఎఫ్ సభ్యులు, పెన్షనర్లు ఇక ఈపీఎఫ్ఓ సేవలకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్స్, అవసరమైన సమాచారాన్ని అధికారిక వాట్సాప్ ఛానెల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

  • Published on- September 14, 2026 / 05:01 PM IST

EPFO WhatsApp channel

  • పీఎఫ్ సభ్యుల కోసం కొత్త వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి
  • ఖాతా సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు
  • ఛానల్ ఫాలో అయితే చాలు.. అన్ని అప్ డేట్స్ నేరుగా ఫోన్లోకి

EPFO WhatsApp Channel : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ సభ్యులు, పెన్షనర్ల కోసం సరికొత్త డిజిటల్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇకపై ఈపీఎఫ్ఓకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్స్, అవసరమైన సమచారాన్ని అధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. సభ్యులకు సమాచారం మరింత వేగంగా ఈజీగా చేరవేయడమే లక్ష్యంగా ఈ కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది.

వాట్సాప్ ఛానల్ ఎలా పనిచేస్తుంది? :
ఈపీఎఫ్ఓ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కొత్త వాట్సాప్ ఛానల్ ఎలా పనిచేస్తుందో ప్రకటించింది. ఈ ఛానెల్‌ను ఫాలో అయ్యే సభ్యులకు ఈపీఎఫ్ఓ సేవలు, లేటెస్ట్ అప్‌‌డేట్స్, కీలక ప్రకటనలు, ఇతర ఉపయోగకరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. అంతేకాదు.. పీఎఫ్ సంబంధిత అప్‌డేట్స్ కోసం వివిధ వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వెతకాల్సిన అవసరం ఉండదు.

ఎలా ఫాలో అవ్వాలి? :
ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలో వాట్సాప్ ఛానల్ సంబంధించిన డైరెక్ట్ లింక్‌ను కూడా షేర్ చేసింది. ఆ లింక్‌పై క్లిక్ చేసి ఛానెల్‌ను ఫాలో కావచ్చు. అదేవిధంగా సభ్యులు సులభంగా చేరేందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా అందిస్తోంది.

Read Also : iQOO Z11xa Sale : సూపర్ గేమింగ్ ఫోన్.. ఇలా కొన్నారంటే ఈ ఐక్యూ Z11xa అతి చౌకైన ధరకే..

అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఛానల్ కేవలం ప్రధానంగా సమాచారం, అప్‌డేట్స్ అందించేది మాత్రమే.. వాట్సాప్ ఛానల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, పర్సనల్ పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవడం, పీఎఫ్ విత్‌డ్రాయల్‌ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ఈపీఎఫ్ఓ స్పష్టంగా ప్రకటించలేదు.

ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త :
ఈపీఎఫ్ఓ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్లు, లింకుల పట్ల సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈపీఎఫ్ఓ అధికారికంగా షేర్ చేసిన ఛానెల్‌నే ఫాలో చేయాలి. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. మొత్తంగా, పీఎఫ్ సభ్యులకు ముఖ్యమైన అప్‌డేట్స్‌ను మరింత ఈజీగా చేరవేసేందుకు ఈపీఎఫ్ఓ ఈ వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.