EPFO New Rules : EPFOలో భారీ మార్పు.. ఇక PF ఖాతాలో నెలకు రూ.3వేలు? ఫుల్ డిటెయిల్స్!

EPFO New Rules : ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనతో ఉద్యోగుల PF, EPS కాంట్రిబ్యూషన్లలో భారీగా మార్పులు రానున్నాయి. కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? జీతంపై ప్రభావం ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published on- September 27, 2026 / 09:15 PM IST

EPFO New Rules

  • ఉద్యోగులకు గుడ్ న్యూస్..
  • జీతం తగ్గినా ఖాతాలో భారీగా సేవింగ్
  • రూ.15 వేల పరిమితి రూ.25 వేలకు పెంపు

EPFO New Rules : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ ఖాతాలో ప్రతినెలా డబ్బులు డబుల్ క్రెడిట్ కానున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితి పెరగనుంది. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ విషయంలో ప్రతిపాదిత మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పీఎఫ్ లెక్కింపులో గరిష్ఠ వేతన పరిమితిని రూ.25 వేలకు పెంపు అతి త్వరలో అమల్లోకి రానుంది. తద్వారా ఉద్యోగుల నెలవారీ కాంట్రిబ్యూషన్‌లో భారీగా మార్పు చోటుచేసుకోనున్నాయి.

నెలకు రూ.3వేలు పీఎఫ్ ఖాతాలోకి :
ప్రస్తుత పరిమితి ప్రకారం రూ.15 వేలపై 12 శాతం చొప్పున ఉద్యోగి వాటాగా గరిష్ఠంగా రూ.1,800 వరకు లెక్కిస్తారు. అయితే పరిమితి రూ.25 వేలకు పెరిగితే ఇదే లెక్కన ఉద్యోగి వాటా రూ.3వేలకు చేరే అవకాశం ఉంటుంది. అంటే.. ఎక్కువ మొత్తం పీఎఫ్ ఖాతాలో పడుతుంది. అయితే, దీనికి అనుగుణంగా నెలకు చేతికి వచ్చే జీతం కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.

Read Also : Honor Magic 9 Series : 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. ఫుల్ స్పెసిఫికేషన్లు లీక్..!

ఉదాహరణకు.. రూ. 20 వేల జీతం ఉంటే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ. 3,134, ఖాతాదారుడి కాంట్రిబ్యూషన్ రూ. 2,400, కంపెనీ కాంట్రిబ్యూషన్ రూ. 734 ఉంటుంది. కంపెనీ కాంట్రిబ్యూషన్ నుంచి అదనంగా రూ. 1,666 ఈపీఎస్‌కు వెళ్తుంది. అదే నెలకు రూ. 35 వేలు జీతం ఉంటే వారికి తప్పనిసరి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ. 6 వేలుగా ఉంటుంది.

కంపెనీ కాంట్రిబ్యూషన్‌లో కొంత భాగం EPSకు, మిగిలిన మొత్తం ఈపీఎఫ్‌కు వెళ్లే విధానం ఉంటుంది. అందుకే, ఉద్యోగి జీతం, బేసిక్ పే, సంస్థ అమలు చేసే పీఎఫ్ విధానం ఆధారంగా వాస్తవ లెక్కలు మారవచ్చు. ప్రతి ఉద్యోగి ఖాతాలో వెంటనే రూ.3వేలు జమ అవుతుందని అనుకోవడం సరికాదు. అమలు తేదీ, తుది నిబంధనలు, అర్హతలు, కాంట్రిబ్యూషన్ విధానం అధికారికంగా స్పష్టం కావాల్సి ఉంది.

కొత్త పరిమితి అమల్లోకి వస్తే కొత్తగా 51 లక్షల మందికి పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. పీఎఫ్, ఈపీఎస్ బీమా వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే, ఉద్యోగులు తమ పే స్లిప్‌లో బేసిక్ పే, ఎంప్లాయ్ పీఎఫ్, ఎంప్లాయిర్ కాంట్రిబ్యూషన్, ఈపీఎస్ వంటి వివరాలను చెక్ చేసుకోవడం బెటర్..