EPFO New Update : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. UAN యాక్టివేషన్ ఇప్పుడు UMANG యాప్‌లోనే.. ఎలాగంటే?

EPFO New Update : పీఎఫ్ ఖాతాదారులకు కీలక అప్‌డేట్.. యూఏఎన్ యాక్టివేషన్ కోసం ఇకపై ఉమాంగ్ యాప్ మాత్రమే వాడాలి. ఈ సింపుల్ ప్రాసెస్ కోసం పీఎఫ్ ఖాతాదారులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

EPFO New Update

  • ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో UAN యాక్టివేషన్ సౌకర్యం అందుబాటులో లేదు
  • యూఏఎన్ యాక్టివేట్ చేసేందుకు ఉమాంగ్ యాప్‌ మాత్రమే వాడాలి
  • ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓతో సహా డిజిటల్ సేవలన్నీ ఒకచోట

EPFO New Update : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. మైగ్రేషన్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ తర్వాత ఈపీఎఫ్ఓ సర్వీసుల్లో అనేక మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుని యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను యాక్టివేట్ చేసే కొత్త యూఏఎన్ జనరేట్ ప్రాసెస్ పూర్తిగా మార్చేసింది.

ఈ రెండు సర్వీసులను మీరు ఉమాంగ్ యాప్‌ ద్వారా చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ కూడా ఉంటుంది. ఈపీఎఫ్ఓ యూఏఎన్​​ సర్వీసుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యూఏఎన్ యాక్టివేషన్ కోసం UMANG యాప్‌ ఓపెన్ చేయాలి. ప్రస్తుతం మీ యూఏఎన్ యాక్టివేషన్ కోసం ఈ ఫీచర్ ఈపీఎఫ్ఓ ​​పోర్టల్‌లో అందుబాటులో లేదు. ఇకపై ఉమాంగ్ యాప్‌ ద్వారా యాక్టివేట్ చేయగలరు. ఈ ప్రాసెస్ కోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.

Read Also : Accused Raj Kumar : హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి.. కొత్తూరు వద్ద మృతదేహం..!

మీ UAN నెంబర్ ఎలా యాక్టివేట్ చేయాలంటే? :

  • ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • యాప్‌ ఓపెన్ చేశాక ఈపీఎఫ్ఓ ​​సర్వీసెస్‌ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూఏఎన్ సర్వీసెస్‌కు వెళ్లాలి.
  • యూఏఎన్ యాక్టివేషన్ ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • వినియోగదారులు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాలి.
  • వెరిఫికేషన్ తర్వాత UAN యాక్టివేట్ కోసం స్క్రీన్ పై కనిపించే సూచనలు పాటించాలి.

UAN ఎలా జనరేట్ చేయాలంటే? :

  • కొత్త యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను జనరేట్ చేసేందుకు ముందుగా UMANG యాప్‌ను ఓపెన్ చేయాలి.
  • యాప్‌ ఓపెన్ చేశాక వినియోగదారులు EPFO ​​సర్వీసెస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత UAN కేటాయింపు, యాక్టివేషన్‌ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • యూఏఎన్ జనరేట్ చేసేముందు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.