EPFO Rules 2026 : PF డబ్బుల కోసం ఇక టెన్షన్ లేదు.. EPFO కొత్త రూల్స్‌తో ఫాస్ట్ సెటిల్‌మెంట్!
EPFO Rules 2026 : పీఎఫ్ ఫండ్ విత్ డ్రా ఇకపై ఆటో సెటిల్మెంట్ కానుంది. వారాలు, నెల వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. క్లెయిమ్ కోసం రిక్వెస్ట్ చేసిన వెంటనే సెటిల్మెంట్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 18, 2026 / 06:44 PM IST
EPFO Rules 2026
- పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే అప్‌డేట్
- మీ డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఇకపై చాలా ఈజీ
- పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ ఆటోమాటిక్ కానుంది.
EPFO Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇకపై చాలా ఈజీ కానుంది. ఇప్పటివరకు ఫైనల్ పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసేందుకు వారాలు లేదా నెల సమయం పట్టేది. కొన్నిసార్లు, కంపెనీ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ కారణంగా ఎక్కువ ఆలస్యం జరిగేది.
అలాగే డాక్యుమెంటేషన్ లేదా కేవైసీలో లోపాల కారణంగా క్లెయిమ్‌లు నిలిచిపోయేవి. కానీ, ఇప్పుడు, ఈపీఎఫ్ఓ ఈ ప్రాసెస్ ఆటోమేట్ చేయనుంది. దాంతో ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ దక్కనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీరు ఉద్యోగం మానేసిన తర్వాత మీ పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) విత్‌డ్రా కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ విత్‌డ్రాయల్ ప్రాసెస్ మరింత ఈజీ కానుంది. ప్రస్తుతం అడ్వాన్స్ పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు ఆటో-సెటిల్‌మెంట్ ఫీచర్ ఉన్నట్లే..
Read Also : Paytm Pocket Money : టీనేజర్లకు అదిరిపోయే ఫీచర్.. బ్యాంక్ ఖాతా లేకున్నా పేటీఎం పేమెంట్స్.. ఎలాగంటే?
ఇప్పుడు ఫైనల్ పీఎఫ్ విత్‌డ్రాయల్స్ కూడా మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయి. తద్వారా ఉద్యోగుల ఫండ్స్ నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు ఫాస్ట్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. తద్వారా పదేపదే ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
పీఎఫ్ ఆటో-సెటిల్మెంట్ సౌకర్యం :
ఫైనల్ పీఎఫ్ విత్‌డ్రా కోసం ప్రభుత్వం ఆటో-సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతోందని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి తెలిపారు. ఉద్యోగులు తమ ఉద్యోగాలు మారినప్పుడు వారి పీఎఫ్ ఖాతాను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసే క్లెయిమ్‌లను ఆటో-సెటిల్ అయ్యే ప్రాసెస్ త్వరగా పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓలో 7 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఉద్యోగాలు మారేవారికి కూడా బిగ్ రిలీఫ్ ఉంటుంది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ కోసం ప్రత్యేక ఫారాలు నింపాల్సిన అవసరం తగ్గవచ్చు. ఒక ఉద్యోగి కొత్త కంపెనీలో జాయిన్ అయితే వారి పాత పీఎఫ్ ఖాతా కొత్త ఖాతాకు ఆటోమేటిక్‌గా లింక్ అయ్యేలా ఈపీఎఫ్ఓ (EPFO) సిస్టమ్ రెడీ చేస్తోంది.
ప్రస్తుత టెక్నాలజీ, స్టార్టప్, ప్రైవేట్ సెక్టార్లలో చాలామంది ఉద్యోగాలు మారుతుంటారు. ఈ కొత్త మార్పు లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనకరంగా మారనుంది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఆన్‌లైన్ క్లెయిమ్‌లు, ఆధార్ లింక్, ఈజీ కైవసీ వంటి సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఆటో-సెటిల్మెంట్, ఆటో-ట్రాన్స్‌ఫర్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే, ఈ సౌకర్యం పూర్తిస్థాయిలో అమలులోకి రావాల్సి ఉంది.
