EPFO Shutdown : PF ఖాతాదారులకు బిగ్ షాక్.. ఈపీఎఫ్ఓ, UMANG సేవలు బంద్.. క్లెయిమ్స్ ఎప్పటి వరకు ఆగుతాయంటే?

EPFO Shutdown : పీఎఫ్ సభ్యులు కొత్త ఆన్‌లైన్ క్లెయిమ్‌లు చేయలేరు. పాత క్లెయిమ్‌లు కూడా ప్రాసెస్ కావు. సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చేంతవరకు ఆగాల్సిందే.. ఇంకా ఎన్నిరోజుల వరకు పీఎఫ్ సేవలు పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం..

EPFO Shutdown

  • పీఎఫ్ డబ్బులు తీసేవాళ్లకు బిగ్ షాకింగ్ న్యూస్
  • ఈపీఎఫ్ పోర్టల్ సర్వీసులతో పాటు ఉమాంగ్ సేవలు బంద్
  • కొత్త క్లెయిమ్స్ చేయలేరు.. పాత క్లెయిమ్స్ మరింత ఆలస్యం

EPFO Shutdown : పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? జర ఆగండి.. పీఎఫ్ డబ్బులు ఇప్పుడు తీయొద్దు.. ఒకవేళ డబ్బులు డ్రా చేసేందుకు ట్రై చేసినా పైసా కూడా రాదు.. ఎందుకంటే.. పీఎఫ్ క్లెయిమ్స్ పూర్తిగా నిలిచిపోయాయి.

మీ పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ విత్‌డ్రా, క్లెయిమ్ సెటిల్మెంట్ లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చూస్తుంటే కొద్దిరోజులు ఆగడమే బెటర్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ క్లెయిమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

అంతేకాదు.. ఈపీఎఫ్ఓ ​​పోర్టల్‌లోనూ ప్రభుత్వ ఉమాంగ్ యాప్‌లోనూ పీఎఫ్ సేవలు కొద్ది రోజులు అందుబాటులో ఉండవు. ఈ సర్వీసుల నిలిపివేత లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. ఈ పీఎఫ్ సేవలు ఎప్పటినుంచి ఎప్పుటివరకూ పనిచేయవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోర్టల్ క్లెయిమ్ సర్వీసులు 3 రోజులు బంద్ :
ఈపీఎఫ్ఓ నోటీసు ప్రకారం.. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లు, డేటాబేస్ సిస్టమ్‌ల అప్‌గ్రేడ్ చేస్తోంది. ఆన్‌లైన్ క్లెయిమ్, ప్రాసెసింగ్ సేవలు జూన్ 26వ తేదీ 00:00 గంటల నుంచి జూన్ 28వ తేదీ 23:59 గంటల వరకు పూర్తిగా నిలిచిపోతాయి. పీఎఫ్ పోర్టల్‌లోని అన్ని డిజిటల్ సేవలు జూన్ 29వ తేదీ 00:00 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి.

Read Also : Most Affordable Cars : ఫ్యామిలీ సేఫ్టీకి ఫుల్ గ్యారెంటీ! భారత్‌లో 5 స్టార్ రేటింగ్‌తో టాప్ 5 చీపెస్ట్ కార్లు.. మీ ఫేవరెట్ ఏది?

ఈ మెయింట్‌నెన్స్ టైంలో పీఎఫ్ సభ్యులు కొత్త ఆన్‌లైన్ క్లెయిమ్‌లను దాఖలు చేయలేరు. అలాగే పాత క్లెయిమ్‌లు కూడా ప్రాసెస్ చేయరు. షట్‌డౌన్‌కు ముందు సమర్పించిన క్లెయిమ్‌లు, సర్వీసులు రీస్టోర్ అయిన తర్వాత మాత్రమే ప్రాసెస్ అవుతాయి.

జూలై 2 వరకు ఉమాంగ్ యాప్ సేవలు బంద్ :
ఈపీఎఫ్ పోర్టల్‌కు అదనంగా షెడ్యూల్డ్ నిర్వహణతో ప్రభుత్వ యాప్ ‘ఉమాంగ్’లో పీఎఫ్ సంబంధిత సేవలు జూలై 2, 2026 వరకు నిలిచిపోతాయని ఈపీఎఫ్ఓ ​​మరో నోటీసులో పేర్కొంది. ఉమాంగ్ యాప్‌లో ఈ అంతరాయం కారణంగా ఖాతాదారులు మరికొద్ది రోజులు సేవలను పొందలేరు.

  • పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్
  • కొత్త క్లెయిమ్‌ను ఫైల్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయడం
  • UAN సంబంధిత సర్వీసులు
  • ఫిర్యాదు దాఖలు చేయడం
  • స్కీమ్ సర్టిఫికేట్, లైఫ్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్

మీకు పీఎఫ్ సంబంధించిన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ కోసం జూన్ 29 వరకు, ఉమాంగ్ యాప్ కోసం జూలై 2 వరకు వేచి ఉండక తప్పదు.