EPFO Update : మీ PF ఖాతా లాక్ అయిందా? టెన్షన్ వద్దు.. ఇలా అన్‌లాక్ చేసేయండి!

EPFO Update : మీ అన్‌బ్లాక్ రిక్వెస్ట్ అప్రూవల్ అయితే మీ అకౌంట్ రీయాక్టివేట్ అవుతుంది. మీ ఈపీఎఫ్ అకౌంట్ అన్‌బ్లాక్ అయిన తర్వాత మీరు క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు.

EPFO Update ( Image Credit : AI )

  • పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే అప్‌డేట్
  • పీఎఫ్ అకౌంట్ అన్ లాక్ ఎలా చేయాలో తెలుసా?
  • ఇన్ యాక్టివ్ పీఎఫ్ ఖాతాల కోసం SOP కొత్త ఫీచర్

EPFO Update : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవలే ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిసెజర్ (SOP) ప్రవేశపెట్టింది. ఈ SOP విధానం ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ ఇన్ యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు. ఈ SOP ఫీచర్ ఉపయోగించి ఇన్ యాక్టివ్ పీఎఫ్ (EPFO Update) ఖాతాను ఎలా అన్‌బ్లాక్ చేయాలో ఇప్పుడు పూర్తి ప్రాసెస్ తెలుసుకుందాం..

UAN నంబర్‌ ఎలా పొందాలి :
మీకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లేకుంటే.. ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఇందుకోసం మీరు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వెళ్లాలి. ఒకవేళ మీరు పీఎఫ్ ఆఫీసుకు వెళ్లలేని పక్షంలో EPFIGMS పోర్టల్ (https://epfigms.gov.in/) ద్వారా రిక్వెస్ట్ పంపవచ్చు. మీ బ్యాంక్ వివరాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా మీరు UANను పొందవచ్చు. ఆ తర్వాత UAN KYC చేసిన విధంగానే ఈపీఎఫ్ ఖాతాను కూడా అన్‌బ్లాక్ చేయాలి.

కేవైసీ తప్పనిసరి :
మీ ఈపీఎఫ్ ఖాతాను అన్‌బ్లాక్ చేసేందుకు కేవైసీ అవసరం. మీరు ఇంకా చేయకపోతే మీకు వీలైనంత త్వరగా పూర్తి చేయండి. మీరు ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వెళ్లడం ద్వారా గానీ లేదా ఆన్‌లైన్‌లో గానీ మీ KYCని పూర్తి చేయవచ్చు.

మీరు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతాను అన్‌బ్లాక్ చేసేందుకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. మీ అన్‌బ్లాక్ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే మీ ఖాతా తిరిగి యాక్టివేట్ అవుతుంది. మీ ఈపీఎఫ్ ఖాతా అన్‌బ్లాక్ అయ్యాక మీరు క్లెయిమ్ దాఖలు చేసేందుకు వీలుంటుంది.

క్లెయిమ్ దాఖలు చేయడం :
మీరు ఈపీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేయాలంటే ఫీల్డ్ ఆఫీసర్ నుంచి కూడా అసిస్టెన్స్ పొందవచ్చు. రూ. 5 లక్షల లోపు క్లెయిమ్‌లకు ఫస్ట్ లెవల్ అప్రూవల్ అవసరం కాగా, రూ. 5 లక్షలకు మించిన క్లెయిమ్‌లకు థర్డ్ లెవల్ అప్రూవల్ అవసరం ఉంటుంది.

Read Also : Vivo Y400 Price : వివో లవర్స్ మీకోసమే.. ఈ వివో Y400పై రూ. 12వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

అప్పుడప్పుడు, అసంపూర్ణమైన కేవైసీ డేటా కారణంగా ఖాతాలు లాక్ అవుతాయి. మీ పీఎఫ్ ఖాతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మీ ఆధార్, పాన్ బ్యాంకు ఖాతాను మీ UANకు లింక్ చేసి ఉండాలి.

ఈ లింకులు లేకపోతే పోర్టల్‌ను విజిట్ చేసి ‘Manage’ ట్యాబ్ కింద ఉన్న ‘KYC’ కేటగిరీలో మీ వివరాలను అప్‌డేట్ చేయండి. మీ పేరు పుట్టిన తేదీ మీ ఆధార్ కార్డు పీఎఫ్ రికార్డులలో ఉన్న వాటితో సరిపోలాలని గుర్తుంచుకోండి. లేకుంటే మీ అకౌంట్ మళ్లీ బ్లాక్ అవుతుంది.

ఆన్‌లైన్ ప్రాసెస్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? :
కొన్నిసార్లు, టెక్నికల్ లోపాలు లేదా డేటా వ్యత్యాసాల కారణంగా ఆన్‌లైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో మీ సమీపంలోని ఈపీఎఫ్ఓ ​​ఫీల్డ్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ‘జాయింట్ డిక్లరేషన్ ఫారం’ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మీ గత లేదా ప్రస్తుత కంపెనీ ధృవీకరించాలి. ఈ ఫారంతో పాటు, మీ ఆధార్ పాన్ కార్డు కాపీలను సబ్మిట్ చేయండి. ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (RPFC) మీ డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత మీ ఖాతా మాన్యువల్‌గా యాక్టివేట్ అవుతుంది.

మీ PF అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే ఉద్యోగం మారిన వెంటనే మీ పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీ ఖాతా ఇన్‌యాక్టివ్ కాకుండా ఉంటుంది. మీ ఇ-పాస్‌బుక్‌ను రెగ్యులర్ చెక్ చేసుకోండి. మీ UAN పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేసుకోండి.