EPFO Update : పీఎఫ్ ఖాతాదారులకు కొత్త EPFO రూల్.. ATMలో పీఎఫ్ డబ్బులు తీస్తే Tax తగ్గుతుందా? ఫుల్ డిటెయిల్స్
EPFO Update : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. బ్యాంకు ఖాతా డబ్బులు తీసుకున్న మాదిరిగా త్వరలో పీఎఫ్ ఖాతాలో డబ్బులు కూడా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.. అయితే, ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు తీస్తే టాక్స్ తగ్గుతుందా? పూర్తి వివరాలివే..
EPFO Update
- పీఎఫ్ ఖాతాదారులకు అతి త్వరలో కొత్త రూల్
- త్వరలో ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేయొచ్చు
- ఈపీఎఫ్ఓ 3.0 కింద ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా సౌకర్యం
- ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే టాక్స్ బెనిఫిట్ ఉంటుందా?
EPFO Update : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకపై, ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఫండ్స్ ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
‘ఈపీఎఫ్ఓ 3.0’ కింద ఈ ఏటీఎం విత్‌డ్రా సౌకర్యం, పీఎఫ్ చందాదారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. పీఎఫ్ విత్‌డ్రాయల్స్ కోసం ప్రత్యేకంగా ఏటీఎం కార్డు కూడా జారీ అవుతుంది. తద్వారా ఖాతాదారులు తమ ఫండ్స్ యాక్సెస్ చేసి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం కార్డును ఒక సాధారణ బ్యాంక్ డెబిట్ కార్డు మాదిరిగానే వాడుకోవచ్చు. అవసరమైన సమయాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి ఫండ్స్ కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎంత పీఎఫ్ విత్‌డ్రా చేయొచ్చు? :
ఈపీఎఫ్ఓ నిపుణుల ప్రకారం.. ఖాతాదారులు ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. వైద్య అత్యవసర పరిస్థితి, గృహ నిర్మాణం లేదా నిరుద్యోగం వంటివి కారణాలుగా చూపించవచ్చు.
కానీ, ఈ ఏటీఎం విత్‌డ్రాయల్ సౌకర్యం ఎలా పనిచేస్తుంది అనేదానిపై నిర్దిష్ట విధానాలను ఈపీఎఫ్ఓ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. విత్‌డ్రాయల్ పరిమితులను కూడా పేర్కొనలేదు. పీఎఫ్ నిబంధనలలోని ఏ నిర్దిష్ట సెక్షన్ల కింద విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఉంటుందనే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.
ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు తీస్తే ట్యాక్స్ తగ్గుతుందా? :
“వైద్య ఖర్చులు, ఇతర వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసమే ఈ సౌకర్యం ద్వారా బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు (గరిష్టంగా రూ. 1 లక్ష నుంచి 2 లక్షల పరిమితి)తో విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఉంటుందని అంచనా. అయితే, మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాలకు వర్తించే పన్ను విధానం మునుపటిలాగే యథాతథంగా ఉంటుంది.
Read Also : PAN Card Rules : పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు.. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే కొత్త పాన్!
పీఎఫ్ డబ్బు విత్ డ్రాపై పన్ను విషయానికి వస్తే.. ఎప్పుడు తీసుకుంటున్నారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 5 ఏళ్లు సర్వీసు పూర్తయ్యాక తీసుకుంటే ట్యాక్స్ ఉండదు. కానీ, 5 ఏళ్ల కన్నా ముందు డబ్బులు విత్ డ్రా చేస్తే కొన్ని పరిస్థితుల్లో ట్యాక్స్ పడే అవకాశం ఉంది.
అంతేకానీ, ఏటీఎం ద్వారా తీసుకున్నా లేదా ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకున్నా ట్యాక్స్ నిబంధనల్లో మార్పు ఉండదు. విత్ డ్రా చేసే విధానం మారడం వల్ల ట్యాక్స్ తగ్గదు. ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకున్నా ట్యాక్స్ అసలు తగ్గదు అలానే ఉంటుంది.
వడ్డీ రేటు ఎంత? :
కేంద్ర ప్రభుత్వం 2025, 2026 ఆర్థిక సంవత్సరాలకు ఈపీఎఫ్ చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024–2025), ప్రభుత్వం ఇదే విధంగా 8.2 శాతం వడ్డీ రేటును అందించింది. ఈసారి వడ్డీ రేటు పెంపు ఉంటుందని అంచనా వేసినా చివరికి వడ్డీ రేటును అదే స్థాయిలో కొనసాగించారు.
