PAN Card Rules : పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు.. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే కొత్త పాన్!
PAN card Rules : పాన్ కార్డు తీసుకునేవారికి బిగ్ అలర్ట్.. కొత్త పాన్ కార్డు తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి. ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మారుతోంది. పూర్తి వివరాలివే
PAN card Rules
- ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు కొత్త రూల్స్ రాబోతున్నాయి
- కేవలం ఒక్క ఆధార్ కార్డుతో పాన్ కార్డు పొందడం కష్టం
- పాన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ మరింత కఠినతరం
PAN card Rules : కొత్త పాన్ కార్డు తీసుకుంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. మీరు పాన్ కార్డు తీసుకోవాలని అనుకుంటే మార్చి 31లోగా తీసుకోవడమే బెటర్. లేదంటే పాన్ కార్డు పొందడం చాలా కష్టంగా మారుతుంది.
ఎందుకంటే.. పాన్ కార్డు ప్రక్రియలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా మారనుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి వర్తిస్తాయి. కొత్త పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ముందుగా ఈ మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం..
పాన్ కార్డులో రాబోయే మార్పులు :
మార్చి 31, 2026 వరకు కేవలం ఆధార్ కార్డుతో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు పత్రాలు ఎలాంటి సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ ప్రక్రియ మరింత మరింత కఠినతరం కానుంది.
అంటే.. కేవలం ఆధార్ ఆధారంగా పాన్ కార్డు పొందలేరు. దరఖాస్తుదారులు అదనపు డాక్యుమెంట్లను సమర్పించాలి. ఈ మొత్తం ప్రక్రియ గతంలో కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. పాన్ కార్డు పొందడం అంత ఈజీగా ఉండదు.
ఆధార్‌తో పాటు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :
ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక పాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకునేందుకు కేవలం ఆధార్ కార్డు మాత్రమే సరిపోదు. దరఖాస్తుదారులు అదనపు గుర్తింపు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సి రావచ్చు.
జనన ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి సర్టిఫికేట్ లేదా ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు ఉండవచ్చు.
ఆధార్ డేటాతో అన్ని వివరాలు సరిపోలాలి :
కొత్త నిబంధనల ప్రకారం.. పాన్ కార్డులో రిజిస్టర్ చేసిన సమాచారం ఆధార్‌తో పూర్తిగా సరిపోలాలి. మీరు అప్లయ్ చేసే ముందు ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు సరిగ్గా ఉండాలి. కొత్త వివరాలతో అప్డేట్ చేయడం చాలా ముఖ్యం.
కేంద్ర ప్రభుత్వం కొత్త అప్లికేషన్ ఫారాలను కూడా అమలు చేయనుంది. ఏప్రిల్ 1, 2026 తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ తప్పనిసరి కానుంది. పాత ఫారాలు ఇకపై చెల్లుబాటు కావు. పాన్ (PAN) సంబంధిత పనులన్నీ ఇప్పుడు కొత్త అప్లికేషన్ల ద్వారా మాత్రమే చేసుకోవచ్చు.
