EPFO WhatsApp Services : ఇక వాట్సప్‌లోనే PF బ్యాలెన్స్.. పాస్‌బుక్ డౌన్‌లోడ్ కూడా.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

EPFO WhatsApp Services : ఈపీఎఫ్ఓ కొత్త వాట్సప్ సేవలను ప్రారంభించింది. 87964 41800 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి PF బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్‌బుక్ PDF ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..

EPFO WhatsApp Services

  • పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
  • ఈపీఎఫ్ఓ కొత్త వాట్సప్ సేవలు ప్రారంభం..
  • ఒక్క HI మెసేజ్‌తో బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు
  • వాట్సప్‌లోనే PF బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు

EPFO WhatsApp Services : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.. ఇకపై ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు..

ప్రతిసారి పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం పీఎఫ్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. నేరుగా వాట్సప్‌లోనే (EPFO WhatsApp Services) ఈ సేవలు పొందవచ్చు.. ఢిల్లీలో జరిగిన 74వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సేవలను ప్రారంభించారు..

వాట్సప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
ముందుగా మీ ఫోన్‌లో 87964 41800 నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ రికార్డుల్లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కు వాట్సప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం మీకు నచ్చిన లాంగ్వేజ్ ఎంచుకోవాలి.

Read Also : Lava Smartphone Prices : లావా ఫోన్ల ధరలకు రెక్కలు.. నవంబర్ 15 నుంచి భారీగా పెంపు.. రూ.3వేల వరకు బాదుడు!

ఆపై స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. పీఎఫ్ బ్యాలెన్స్ ఆప్షన్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే మీ మొబైల్‌కు SMS ద్వారా OTP వస్తుంది. ఆ OTPని వాట్సప్‌లో ఎంటర్ చేయగానే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఉద్యోగి వాటా, యజమాని వాటా, పెన్షన్ మొత్తం, చివరి లావాదేవీ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

పాస్‌బుక్ కూడా పీడీఎఫ్ డౌన్‌లోడ్ :
వాట్సప్ మెనూలోకి వెళ్లి (PF Passbook) ఆప్షన్ ఎంచుకోవాలి. OTP వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పాస్‌బుక్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్‌ను ఓపెన్ చేసేందుకు మీ పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయాలి..

ఇంకా ఏ సేవలు ఉన్నాయంటే? :
కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి కేంద్రం అందించే (PM-VBRY) స్కీమ్ సంబంధించిన వివరాలు, సందేహాలను కూడా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, ఈ సేవలు పొందాలంటే ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచే మెసేజ్ పంపాలి.

అలాగే ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి KYC వివరాలు పీఎఫ్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసి ఉండాలి. ఇకపై పీఎఫ్ వివరాల కోసం యాప్‌లు, వెబ్‌సైట్లు వెతకాల్సిన పని లేకుండా వాట్సప్‌లోనే ఈజీగా తెలుసుకోవచ్చన్నమాట..