ESIC Aadhaar Seeding : మీకు ESIC ఉందా? ఇక ఆధార్‌తో లింక్ తప్పనిసరి.. ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు.. కంప్లీట్ గైడ్..!

ESIC Aadhaar Seeding : మీ ఈఎస్ఐ ఖాతాలో ఆధార్ కార్డుతో ఇంకా సీడింగ్ చేయలేదా? ఇప్పుడే పూర్తి చేయండి.. ఈ సింపుల ప్రాసెస్ మీ ఇంట్లో నుంచే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు.. అది ఎలాగంటే?

ESIC Aadhaar Seeding

  • ఈఎస్ఐ లబ్ధిదారులకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి
  • మీ ఈఎస్ఐ ఖాతాలో ఆధార్ సీడింగ్ కంప్లీట్ అయిందా?
  • ఆధార్ వెరిఫికేషన్ ఇంట్లో నుంచే ఈజీగా ఇలా చేయొచ్చు

ESIC Aadhaar Seeding : మీకు ఈఎస్ఐ అర్హత ఉందా? అయితే ఇది మీకోసమే.. ఈఎస్ఐ బెనిఫిట్స్ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సిందే.. ఈఎస్ఐసీ లబ్ధిదారులు ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి.

ఈఎస్ఐకు సంబంధించి వైద్యపరమైన ప్రయోజనాలను పొందడానికి వీలుగా ఈ కొత్త ప్రాసెస్ అమల్లోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల భద్రతతో పాటు (ESIC Aadhaar Seeding) పారదర్శకతను తీసుకువచ్చేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ ఆధార్ సీడింగ్ పూర్తి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రాసెస్ మీరు ఆన్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 2025లో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. పరిపాలనా పనులలో పారదర్శకతతో పాటు సామాజిక సేవలకు ప్రయోజనాలు అందించడమే దీని ఉద్దేశం.. సబ్సిడీ పథకాల నుంచి ఐడెంటిటీ వెరిఫికేషన్ వరకు ఉన్న ప్రాసెస్ అన్నీ ఈజీ చేసేందుకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది.

Read Also : iPhone 17 Pro Price : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో కోసం వెయిట్ చేయడం వేస్టేనా? ఐఫోన్ 17 ప్రోపై అదిరిపోయే ఆఫర్!

ఈఎస్ఐసీ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ :

కార్మిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. సామాజిక భద్రతా కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ESIC లబ్ధిదారులకు ఇప్పుడు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. పూర్తి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ మీ ఇంటి నుంచే సౌకర్యవంతంగా పూర్తి చేయొచ్చు.

ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలంటే? :

  • ముందుగా (http://www.esic.gov.in) అనే అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
  • ఇప్పుడు ఇన్సూర్డ్ వ్యక్తి బెనిఫిషియరీపై క్లిక్ చేయండి.
  • మీ ID పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత IP కోసం ఆధార్ సీడింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ముందు ఒక లింక్ కనిపిస్తుంది.
  • దానిపై ‘Click for Aadhaar Seeding’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేశాక గెట్ OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఓటీపీని ఎంటర్ చేశాక రిఫరెన్స్ నంబర్ మీ ముందు కనిపిస్తుంది.
  • వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యాక ఆధార్ ఇంటిగ్రేషన్ అవుతుంది.

తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం.. 2025 కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఆధార్ సీడింగ్ తప్పనిసరి కాదు.. ఆ సమయంలో, ప్రభుత్వం లబ్ధిదారులకు ఆధార్ వెరిఫికేషన్ లేదా పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, లేదా డ్రైవర్ లైసెన్స్ వంటి ఇతర మార్గాల ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఛాన్స్ ఇచ్చింది.

అయితే, ఇప్పుడు ఇకపై ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది. అంటే, లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. లబ్ధిదారులు కోరుకుంటే, ఈ ప్రాసెస్ మొబైల్ యాప్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చు.