EV Market Sales April : ఈవీ రంగంలో ఏప్రిల్ సేల్స్ సంచలనం.. టాటా, మహీంద్రా, బజాజ్ అగ్రస్థానం.. ఓలా ఎలక్ట్రిక్‌కు కష్టకాలం..!

EV Market Sales April : భారత మార్కెట్లో ఏప్రిల్ 2026లో ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎలక్ట్రిక్ కార్లు 73 శాతం, ద్విచక్ర వాహనాలు 61 శాతం వృద్ధిని సాధించాయి.

EV Market Sales April

  • ఏప్రిల్ నెలలో భారీగా ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్ల అమ్మకాలు
  • ఎలక్ట్రిక్ కార్లు 73 శాతం, టూవీలర్ వాహనాలు 61 శాతం వృద్ధి
  • ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2శాతం, టూవీలర్ సేల్స్ 23శాతం తగ్గాయి

EV Market Sales April : భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌కు కొత్త ఆర్థిక సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైంది. ఇందులో ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 73శాతం పెరిగి 23,343 యూనిట్లకు చేరగా, ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు 61శాతం పెరిగి 1,48,677 యూనిట్లకు చేరుకున్నాయి.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కొత్త మోడళ్ల విడుదల వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయి. అయితే, మార్చితో పోలిస్తే (EV Market Sales April) అమ్మకాలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. టాటా మోటార్స్, మహీంద్రా, టీవీఎస్ వంటి బ్రాండ్లు ముందు వరుసలో నిలవగా, ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వెనుకబడింది.

మార్చి తర్వాత ఎందుకు క్షీణించింది? :
ఏప్రిల్‌లో గతేడాదితో పోలిస్తే.. బలమైన వృద్ధి కనిపించినప్పటికీ నెలవారీగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2శాతం, టూవీలర్ సేల్స్ 23శాతం తగ్గాయి. మార్చిలో సబ్సిడీ గడువు ముగుస్తుందనే భయం భారీగా కొనుగోళ్లు చేసేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పొడిగించినప్పటికీ మార్చిలో జరిగిన ముందస్తు కొనుగోళ్ల ప్రభావం ఏప్రిల్ గణాంకాలలో స్పష్టంగా కనిపించింది.

కార్ల రంగంలో ఎవరిది ఆధిపత్యమంటే? :
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఈ మూడు కంపెనీలు కలిసి సుమారు 82శాతం మార్కెట్ వాటాను దక్కించుకున్నాయి.

అయితే, కియా మోటార్స్ కూడా కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ కియా కేరెన్స్ క్లావిస్ ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించింది. ఈ సేల్స్ అమ్మకాలు 34 యూనిట్ల నుంచి 341 యూనిట్లకు పెరగడంతో మార్కెట్ వాటా 1.5శాతానికి చేరుకుంది.

Read Also : Wireless Emergency Alert : మీ మొబైల్‌లో సడన్‌గా ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందా? కంగారుపడొద్దు.. ప్రభుత్వం ఎందుకు పంపిందో తెలుసా?

టూవీలర్ వాహనాల్లో మారుతున్న పరిస్థితులివే :
ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో టీవీఎస్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ సంస్థలు సుమారు 65 శాతం నుంచి జాయింట్ మార్కెట్ వాటాతో స్థానాన్ని నిలుపుకున్నాయి. టీవీఎస్ అమ్మకాలు 88శాతం పెరిగి 37,661 యూనిట్లకు చేరగా, చేతక్ స్కూటర్ కారణంగా బజాజ్ ఆటో అమ్మకాలు 71.6శాతం పెరిగి 32,883 యూనిట్లకు చేరుకున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్‌కు భారీ దెబ్బ :
మార్కెట్ లీడర్‌ అయిన ఓలా ఎలక్ట్రిక్‌కు ఏప్రిల్ నెల నిరాశాజనకంగా గడిచింది. కంపెనీ అమ్మకాలు 38.6 శాతం తగ్గి 12,166 యూనిట్లకు పడిపోగా, మార్కెట్ వాటా 21.4 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. అదేవిధంగా, కైనెటిక్ గ్రీన్ సేల్స్ 49శాతం తగ్గి 666 యూనిట్లకు పడిపోయాయి.

మరోవైపు.. ఏథర్ ఎనర్జీ 102శాతం బలమైన వృద్ధిని నమోదు చేసి 27,024 యూనిట్లను విక్రయించింది. 700కు పైగా ఉన్న సేల్స్ సెంటర్లు, సరసమైన ధరల మోడళ్ల కారణంగా ఈ కంపెనీ మార్కెట్‌లో బలమైన ఉనికిని చాటుకుంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ వేగంగా పెరుగుతోందని ఏప్రిల్ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే, సబ్సిడీలు, ధరలు, మార్కెట్ పోటీ వంటి అంశాలు తదుపరి వృద్ధిని నిర్ణయిస్తాయి.