×
Ad

Gold Rates India : భారత్‌లో బంగారం ధరల్లో ఊహించని మార్పు.. పెట్టుబడిదారులకు షాకింగ్ ట్విస్ట్..!

Gold Rates India : భారత బులియన్ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు డిమాండ్‌ తగ్గడంతో బంగారం తగ్గింపుతో ట్రేడవుతోంది. అయితే, చంద్ర నూతన సంవత్సరానికి ముందు చైనాలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక వారంలో బంగారం మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది.

  • Published On : February 14, 2026 / 06:41 PM IST

Gold Rates India ( Image Credit AI )

  • భారత మార్కెట్లో ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
  • గ్లోబల్ మార్కెట్ రేటుతో పోలిస్తే భారత్ బంగారం ధర చాలా తక్కువ
  • బంగారం ధరల హెచ్చుతగ్గులతో వెనక్కి తగ్గిన రిటైల్ కొనుగోలుదారులు
  • గోల్డ్ ధరలు మరింత తగ్గవచ్చనే భయాందోళనలో ఇన్వెస్టర్లు

Gold Rates India : బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత నెల రోజులుగా భారత బులియన్ మార్కెట్లో బంగారం ప్రీమియంతో అమ్ముడవుతోంది. కానీ ఈ వారంలో ఫస్ట్ టైమ్ బంగారం తగ్గింపుతో ట్రేడవుతోంది.

గ్లోబల్ బంగారం మార్కెట్ రేటుతో పోలిస్తే భారత మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. సాధారణంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ రేటుకు లోబడి ఉంటాయి. కానీ, ఇప్పుడు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం అంతర్జాతీయ ధర కన్నా తక్కువకు అమ్ముడవుతోంది.

చైనాలో ఊపందుకున్న బంగారం కొనుగోళ్లు :
బంగారం ధరల హెచ్చుతగ్గుల కారణంగా రిటైల్ కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. అయితే చంద్ర నూతన సంవత్సరానికి ముందు చైనాలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. భారత బులియన్ డీలర్లు అధికారిక దేశీయ బంగారం ధరలపై ఔన్సుకు 12 డాలర్ల వరకు తగ్గింపు అందించారు. ఇందులో 6శాతం దిగుమతి సుంకం, 3శాతం అమ్మకపు పన్ను ఉన్నాయి. గత వారం ఔన్సుకు 70 డాలర్ల వరకు ప్రీమియంలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి.

“ఆభరణాల వ్యాపారులు తయారీ ఛార్జీలపై డిస్కౌంట్లు అందిస్తున్నప్పటికీ ఆభరణాల డిమాండ్ ఇంకా కోలుకోలేదు. రిటైల్ కొనుగోలుదారులు సైతం ప్రస్తుత బంగారం ధరల స్థాయిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం లేదని హైదరాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి చెప్పారు.

బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశం :

గత వారం 10 గ్రాములకు రూ. 1.33 లక్షలకు తగ్గిన దేశీయ ధరలు శుక్రవారం (ఫిబ్రవరి 13) రోజున 10 గ్రాములకు రూ. 1.54 లక్షలుగా ఉన్నాయి. ధరలు మళ్లీ తగ్గవచ్చనే భయాలు తలెత్తుతున్నాయి. ఈ నెలలో ప్రభుత్వం యూఏఈ నుంచి దాదాపు 80 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతులను రాయితీ సుంకంతో కేటాయిస్తుందని అందరూ ఆశించారు. దాంతో చాలా మంది ఆభరణాల వ్యాపారులు, బులియన్ డీలర్లు బ్యాంకుల నుంచి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు.

భారత్, యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ప్రకారం.. యూఏఈ నుంచి బంగారం, వెండి రవాణా తక్కువ దిగుమతి సుంకాలను ఆకర్షిస్తుంది. చైనాలో ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే 9 రోజుల చంద్ర నూతన సంవత్సర సెలవుదినం ముందు బంగారం ప్రపంచ స్పాట్ ధరలకు 8 డాలర్ల తగ్గింపు, ఔన్సుకు 10 డాలర్ల ప్రీమియం మధ్య ట్రేడ్ అయింది.

Read Also : Income Tax Rule 2026 : ఇన్‌కమ్ టాక్స్ కొత్త రూల్స్.. ఇక జీతం పొందేవారికి పండగే..

పెరిగిన బంగారం ధరలు కొంతవరకు కొనుగోళ్లను తగ్గినప్పటికీ మొత్తం డిమాండ్ సానుకూలంగానే ఉందని విశ్లేషకులు రాస్ నార్మన్ అన్నారు. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బంగారు నిల్వలను స్వల్ప వేగంతో పెంచుతూనే ఉందని, మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆభరణాల వినియోగం తగ్గలేదని ఆయన అభివర్ణించారు.

హాంకాంగ్, జపాన్‌లో గోల్డ్ ధరలు ఎంతంటే? :

ఆసియా కేంద్రాల్లో ఒకటైన హాంకాంగ్‌లో బంగారం ఔన్సుకు 1.80 డాలర్ల ప్రీమియంతో సమానంగా ట్రేడ్ అవుతోంది. జపాన్‌లో, ధరలు 6 డాలర్ల తగ్గింపు నుంచి 1 డాలర్ల ప్రీమియం వరకు ఉన్నాయి. అయితే, సింగపూర్‌లో బులియన్ 0.50 డాలర్ల తగ్గింపు, 3.50 డాలర్ల ప్రీమియం మధ్య ఉంటుంది.

జనవరి చివరిలో బంగారం తీవ్ర క్షీణత నుంచి కోలుకుందని, 2026 క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ ధరలు ఔన్సుకు 6వేల డాలర్లకి చేరుకోవచ్చని పీఎల్ క్యాపిటల్ సీఈఓ సందీప్ రైచురా విశ్వసిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ నష్టాలు, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు మద్దతుగా నిలిచాయి.

అగ్నమ్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రశాంత్ మిశ్రా మాట్లాడుతూ.. వెండి బంగారం కన్నా అస్థిరంగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే.. ఇటీవలి గరిష్టాల తర్వాత కొంత లాభాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు బంగారంపై నమ్మకంగా ఉన్నారని చెబుతున్నారు.