Renault SUV Car Offers : కొంటే రెనాల్ట్ కారు కొనాలి.. కొత్త SUV కార్లపై రూ. 2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్ ఎంతంటే?

Renault SUV Car Offers : మీరు ఈ నెలలో రెనాల్ట్ కారు కొనాలని చూస్తుంటే రెనాల్ట్ తన కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి ఆఫర్ల వివరాలివే..

Renault SUV Car Offers

  • నవంబర్ ఆఫర్ల లిస్టులో డస్టర్ టాప్ ప్లేసు
  • రెనాల్ట్ క్విడ్ కారుపై రూ. 40వేల వరకు ఆదా
  • పాత కారు ఎక్స్ఛేంజ్ రూ. 1.50 లక్షల బెనిఫిట్స్

Renault SUV Car Offers : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ రెనాల్ట్ SUV కారు మీకోసమే.. ప్రస్తుతం ఈ నవంబర్ నెలలో రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. డస్టర్ కారుపై రూ. 2.10 లక్షల వరకు అత్యధిక బెనిఫిట్స్ అందిస్తోంది.

బడ్జెట్ కార్ల కస్టమర్ల కోసం క్విడ్ కారుపై రూ. 40వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, మీ పాత కారును ఎక్స్చేంజ్ చేసినప్పుడు లాయల్టీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పూర్తి వివరాలివే..

రెనాల్ట్ డస్టర్ డిస్కౌంట్ ఆఫర్లు :
రెనాల్ట్ నవంబర్ ఆఫర్ల లిస్టులో డస్టర్ టాప్ ప్లేసులో ఉంది. ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ. 2.10 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. టెక్నో+, ఐకానిక్ వంటి టాప్ వేరియంట్లను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 50వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా 4.99శాతం వడ్డీ రేటుతో తక్కువ ఈఎంఐ పొందవచ్చు. అంతేకాదు.. టాప్ వేరియంట్లపై పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 1.50 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

అయితే, తక్కువ వేరియంట్లపై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. లక్ష వరకు ఉంటుంది. తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేసే కస్టమర్‌లు రూ. 25వేల వరకు అదనపు బోనస్‌ను కూడా పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్, స్క్రాప్ బోనస్‌ను ఏకకాలంలో పొందలేరు. గతంలో రెనాల్ట్ కస్టమర్‌లుగా ఉన్నవారు రూ. 10వేల వరకు లాయల్టీ బోనస్‌ను కూడా పొందవచ్చు. భారత మార్కెట్లో డస్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉంటుంది.

Read Also : Samsung-Xiaomi Prices : స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన శాంసంగ్, షావోమీ ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?

రెనాల్ట్ కైగర్ డిస్కౌంట్ ఆఫర్లు :
మీరు తక్కువ ధరలో ఒక SUV కొనాలని చూస్తుంటే.. రెనాల్ట్ కైగర్ అదిరిపోయే ఆప్షన్. ఈ కారుపై కంపెనీ రూ. 65వేల వరకు విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్లు ఎవల్యూషన్+, టెక్నో, ఎమోషన్ వేరియంట్‌లకు వర్తిస్తాయి.

పాత రెనాల్ట్ కస్టమర్లు రూ. 10వేల వరకు లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. కార్పొరేట్ కస్టమర్లకు రూ. 5వేల వరకు, గ్రామీణ కస్టమర్లకు రూ. 4వేల వరకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు. రెనాల్ట్ కైగర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.81 లక్షల నుంచి రూ. 10.40 లక్షల మధ్య ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్ డిస్కౌంట్ ఆఫర్లు :
రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ నవంబర్‌లో రూ. 55వేల వరకు విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. అదనంగా, మీ పాత కారును ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ చేయడం ద్వారా రూ. 25వేల వరకు బోనస్ పొందవచ్చు. కంపెనీ ట్రైబర్‌పై లాయల్టీ బెనిఫిట్స్ కూడా పేర్కొంది. కానీ, గరిష్ట మొత్తాన్ని వెల్లడించలేదు.

రెనాల్ట్ క్విడ్ డిస్కౌంట్ ఆఫర్లు :
తక్కువ బడ్జెట్‌లో చిన్న కారు కొనేవారికి రెనాల్ట్ క్విడ్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌పై మొత్తం రూ. 40వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్, పాత కారును ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ చేసినప్పుడు రూ. 25వేల వరకు బోనస్ పొందవచ్చు. అయితే, క్విడ్‌పై కంపెనీ ఎలాంటి నిర్దిష్ట కార్పొరేట్, గ్రామీణ, లేదా లాయల్టీ బెనిఫిట్స్ అందించడం లేదు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.53 లక్షల నుంచి రూ. 5.61 లక్షల మధ్య ఉంటుంది.