Fake Tax Notices : ఐటీ శాఖ హెచ్చరిక.. మీకూ Tax నోటీసులు వచ్చాయా? ఇది పక్కా స్కామర్ల పనే.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు!

Income Tax Notices : పన్ను చెల్లింపుదారుల పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ డేటా లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇమెయిల్, SMS లేదా ఫోన్ కాల్ ద్వారా ఎప్పుడూ అడగవద్దని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించింది. పన్ను సంబంధిత ఏదైనా పని కోసం అధికారిక పోర్టల్‌ను మాత్రమే వాడాలి.

Fake Income Tax Notices ( Image Credit to Google Gemini AI )

  • పన్నుచెల్లింపుదారులు, సాధారణ ప్రజలకు హెచ్చరిక
  • టాక్స్ చెల్లించాలంటూ మీకు ఏమైనా మెసేజ్ లు వచ్చాయా?
  • ఫేక్ ఐటీ నోటీసులను ఎలా గుర్తించాలి? ఏం చేయాలి? చేయకూడదు?
  • ఎలా కంప్లయింట్ చేయాలి? ఐటీ శాఖ అధికారుల సూచనలివే

Income Tax Notices : టాక్స్ పేయర్లు, సామాన్యులకు బిగ్ అలర్ట్.. మీకు వచ్చే ఆదాయం, ఇతర ఖర్చులపై టాక్స్ కట్టాలంటే ఏమైనా నోటీసులు అందుకున్నారా? బిగ్ అలర్ట్.. అది స్కామర్ల స్కెచ్ కావొచ్చు.. ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చినట్లుగా అనేక ఫేక్ మెసేజ్, నోటీసులు సోషల్ మీడియా, ఇమెయిల్‌లలో వస్తున్నాయి.

2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి వచ్చే ఇలాంటి నోటీసులు ఏమైనా వస్తే కచ్చితంగా స్కామర్ల పనే.. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. ఇదే విషయంలో పన్ను చెల్లింపుదారులను ఐటీ శాఖ హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లపై కూడా ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంటుంది.

నోటీసుల పేరుతో ఫిషింగ్ అటాక్స్ :
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. మోసగాళ్ళు అధికారిక ఈమెయిల్‌ మాదిరిగా మెయిల్స్ పంపుతున్నారు. మీ అసెస్‌మెంట్ ఆర్డర్ జారీ అయిందని లేదంటే మీకు పేమెంట్ ఇంకా పెండింగ్ ఉందని నమ్మిస్తున్నారు. ఈ ఇమెయిల్‌లో క్లికబుల్ లింక్ ఉంది. మీరు లింక్‌పై క్లిక్ చేయడం లేదా అటాచ్‌మెంట్‌ డౌన్‌లోడ్ చేయాలంటారు. ఇలా చేస్తే మాల్వేర్ మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి ఇంజెక్ట్ చేయవచ్చు. మీ బ్యాంకింగ్ వివరాలను అడిగే ఫేక్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవ్వొచ్చు.

‘ఫేక్ ఈ-పాన్’పై PIB బిగ్ అలర్ట్ :
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ మరో స్కామ్‌ను బయటపెట్టింది. ప్రజలు తమ e-PAN కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఫేక్ ఇమెయిల్‌లను అందుకుంటున్నారు. e-PAN రెడీగా ఉందంటూ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ ఈ ఇమెయిల్‌లు వస్తున్నాయి. ఈ ఇమెయిల్‌లు మోసపూరితమైనవని PIB స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే మీ ఫోన్ హ్యాక్ చేయడం లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిస్తారు.

Read Also : Mobile Data Tax : వామ్మో.. ఏంది భయ్యా.. ఇప్పటికే 18% GST.. ఇప్పుడు ప్రతి GB డేటాపై కొత్త పన్ను? మొబైల్ యూజర్లకు డబుల్ టాక్స్!

రియల్ టాక్స్ నోటీసు ఎలా గుర్తించాలి? :
పన్ను చెల్లింపుదారులకు మోసాలను నివారించేందుకు ఆదాయపు పన్ను శాఖ కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
అధికారిక డొమైన్ : డిపార్ట్‌మెంట్ పంపే అన్ని చట్టబద్ధమైన ఈమెయిల్‌లు @incometax.gov.in వంటి అధికారిక డొమైన్ నుంచి మాత్రమే వస్తాయి.

పోర్టల్‌లో వెరిఫికేషన్ : ఏదైనా నోటీసు లేదా ఆర్డర్ అథెంటికేషన్ వెరిఫై చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

మీకు అనుమానాస్పద ఇమెయిల్ వస్తే ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? :
యూజర్ల భద్రత కోసం అధికారులు కొన్ని కఠినమైన సూచనలు జారీ చేశారు అవేంటో ఓసారి చదవండి..

రిప్లయ్ అసలు ఇవ్వొద్దు : ఏదైనా అనుమానాస్పద ఇమెయిల్‌లకు రిప్లయ్ అసలు ఇవ్వవద్దు.

లింక్‌లు, అటాచ్‌మెంట్‌ ఓపెన్ చేయొద్దు : ఇమెయిల్‌లలోని ఏ లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు లేదా ఏ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు.

డేటాను షేర్ చేయొద్దు : ఏదైనా లింక్ పొరపాటున ఓపెన్ చేసినా అక్కడ మీ పిన్, పాస్‌వర్డ్, OTP లేదా బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయవద్దు.

యాంటీ-వైరస్ : మీ ఫోన్లలో యాంటీ-వైరస్, ఫైర్‌వాల్‌ను అప్ డేట్స్ తప్పక ఉండాలి.

Note : మీరు ఇలాంటి ఫేక్ ఇమెయిల్‌ అందుకుంటే (webmanager@incometax.gov.in)కు రిపోర్టు చేయొచ్చు. పన్ను చెల్లింపుదారుల పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ సమాచారం లేదా బ్యాంక్ ఖాతా వివరాలను ఇమెయిల్, SMS లేదా ఫోన్ కాల్ ద్వారా ఎప్పుడూ అడగవద్దని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. పన్ను సంబంధిత పనుల కోసం అధికారిక ప్రభుత్వ పోర్టల్‌లను మాత్రమే వాడండి.