FASTag Toll Plaza : టోల్ ప్లాజాలో FASTag పనిచేయకపోతే టెన్షన్ పడొద్దు.. NHAI చెప్పిన సింపుల్ సొల్యూషన్!

FASTag Toll Plaza : మీ ఫాస్టాగ్ పనిచేస్తుందా? పాత లేదా పాడైన ఫాస్టాగ్‌లతో టోల్ ప్లాజాల వద్ద స్కానింగ్ సమస్యలు వస్తాయి. ఏయే సందర్భాల్లో వాహనదారులు ఫాస్టాగ్ మార్చుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

FASTag Toll Plaza

  • ఫాస్టాగ్ స్కాన్ కాకపోతే డబుల్ ఛార్జ్ పడుతుందా?
  • హైవే ప్రయాణికులకు అలర్ట్.. ఫాస్టాగ్ సమస్యలకు చెక్
  • టోల్ వద్ద ఫాస్టాగ్ పనిచేయకపోతే క్యాష్ చెల్లించాలా?

FASTag Toll Plaza : ఫాస్టాగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ దగ్గర యాక్టివ్ ఫాస్టాగ్ ఉన్నా టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ ఆలస్యం అవుతోందా? టోల్ సిస్టమ్‌లో సమస్య కాదు.. మీ ఫాస్టాగ్‌లోనే ఉండొచ్చు. టోల్ బూత్‌ల వద్ద స్కానింగ్ ఫెయిల్యూర్, లాంగ్ క్యూలలో ఉండాల్సి వస్తుందా?

అయితే దీనికి అసలు కారణం.. మీ ఫాస్టాగ్ పాడైపోవచ్చు లేదా బాగా అరిగిపోయి ఉండొచ్చు. ఈ కారణంగానే ఫాస్టాగ్ టోల్ ప్లాజాల వద్ద పనిచేయకపోవచ్చు. దీనికి సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అడ్వైజరీని జారీ చేసింది.

NHAI ప్రకారం.. ప్రతిరోజూ సూర్యరశ్మికి గురికావడం వల్ల కాలక్రమేణా ఫాస్టాగ దెబ్బతినవచ్చు. తద్వారా టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన స్కానర్‌లతో కమ్యూనికేట్ చేసే ట్యాగ్ కెపాసిటీ ఎఫెక్ట్ అవుతుంది.

ఫాస్టాగ్‌లు ఎందుకు పాడవుతాయి? :
ఫాస్టాగ్ పనిచేయకపోవడానికి గల 3 ప్రధాన కారణాలను NHAI సూచిస్తోంది..

విండ్‌షీల్డ్‌ క్లీనింగ్ : అధికంగా రుద్దడం లేదా గట్టి క్లీనింగ్ చేసే పదార్థాలను వాడటం వల్ల ట్యాగ్‌లో ఉండే RFID చిప్ దెబ్బతినవచ్చు.

హీట్, డస్ట్, వర్షంలో తడవడం : తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఫాస్టాగ్ తొందరగా పాడైపోతుంది. ఇంటర్నల్ పార్టులు పనిచేయవు. ఫాస్టాగ్ స్కానింగ్ పనిచేయదు.

Read Also : Top 5 Family Scooters : బైకుల కన్నా స్కూటర్లే బెటర్.. ట్రాఫిక్‌లో టెన్షన్ లేదు.. ఫ్యామిలీలు తెగ కొనేస్తున్న టాప్ 5 స్కూటర్లు ఇవే!

పాత ఫాస్ట్‌ట్యాగ్‌లు : ట్యాగ్‌లు సాధారణంగా కాలక్రమేణా ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత పాడైపోతాయి.

మీ ఫాస్టాగ్‌ను ఎప్పుడు మార్చుకోవాలి? :
ఈ కింది సందర్భాలలో వాహనదారులు ఫాస్టాగ్ రీప్లేస్‌మెంట్‌ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ 5 ఏళ్ల కన్నా పాతదా? :
మీకు ఫాస్టాగ్ స్కానింగ్ ఫెయిల్యూర్ లేదా టోల్ డిలే సమస్య ఉందా? అయితే, లింక్ చేసిన అకౌంటులో తగినంత బ్యాలెన్స్ ఉన్నా ఫాస్టాగ్ సరిగా లేకుండా వల్ల మీ ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. టోల్ ప్లాజాల వద్ద ఎక్కువగా ఎదురుచూడాల్సి వస్తుంది.

వాహనదారులు ఏం చేయాలి? :
రీప్లేస్‌మెంట్ కోసం మీ ఫాస్టాగ్‌ను జారీ చేసిన బ్యాంకును సంప్రదించాలని NHAI చెబుతోంది. పనిచేయని ఫాస్టాగ్‌ను మార్చడం వల్ల టోల్ గేట్లను వేగంగా దాటవచ్చు. టోల్ బూత్‌ల వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది.

హైవేలంతటా టోలింగ్ MLFF సిస్టమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. యాక్టివ్ ఫాస్టాగ్‌ తప్పనిసరిగా ఉండాలి. మీ ఫాస్టాగ్ సరిగ్గా స్కాన్ చేయకపోతే.. ముందుగానే మార్చేస్తే చాలా టైమ్ సేవ్ అవుతుంది. రోడ్డుపై టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.