Flipkart Big Billion Days 2026 : ఈ నెల 24 నుంచే ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25పై అదిరిపోయే డీల్స్..!
Flipkart Big Billion Days 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సెప్టెంబర్ 24 నుంచే ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25 సహా పలు స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, సూపర్ మనీ క్యాష్‌బ్యాక్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- September 21, 2026 / 04:36 PM IST
Flipkart Big Billion Days 2026
- సెప్టెంబర్ 24న ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
- కొనుగోలుదారులు బ్యాంకు కార్డ్ ఆఫర్లతో అదనపు తగ్గింపులు
- ఆపిల్ ఐఫోన్ 17, గెలాక్సీ ఎస్25 ఇతర ఫోన్‌లపై డిస్కౌంట్లు
Flipkart Big Billion Days 2026 : ఆన్‌లైన్ షాపర్లకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 వచ్చేస్తోంది. రాబోయే సేల్ సంబంధించి ఈ-కామర్స్ దిగ్గజం షెడ్యూల్‌లో అనేక మార్పులు చేసింది.
గతంలో అక్టోబర్ 9 నుంచి మెయిన్ సేల్ ప్రారంభమవుతుందని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. లేటెస్టుగా సెప్టెంబర్ 24 నుంచే ఎర్లీ-బర్డ్ సేల్ ప్రారంభించనున్నట్లు మైక్రోసైట్‌లో వెల్లడించింది. అంటే ముందుగా ప్రకటించిన తేదీ కన్నా దాదాపు 15 రోజుల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులకు సాధారణ కస్టమర్ల కన్నా అడ్వాన్స్ యాక్సెస్ లభించే అవకాశం ఉంది. అర్హత కలిగిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు కూడా ఎర్లీ యాక్సెస్ బెనిఫిట్ అందనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, పూర్తి ఆఫర్ నిబంధనలు, అర్హతలు సేల్ సమయంలో వర్తించనున్నాయి.
బ్యాంక్ ఆఫర్లతో మరింత ధర తగ్గింపు :
బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర కేటగిరీల్లో డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కూడా కొనుగోలుదారులకు అదనపు బెనిఫిట్ అందించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ మైక్రోసైట్ సమాచారం ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు కూడా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ సూపర్ మనీ ద్వారా పేమెంట్లు చేసే కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ లభించనుంది. అయితే, డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన కనీస కొనుగోలు విలువ, గరిష్ఠ పరిమితి వంటి నిబంధనలు వర్తించవచ్చు.
ఐఫోన్ 17, గెలాక్సీ S25పై ఫోకస్ :
ఈసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25 వంటి ప్రీమియం ఫోన్లపై ప్రత్యేక డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.
అంతేకాదు.. రియల్‌మి P4 5జీ, లావా విరాట్ వి1 4జీ, టెక్నో స్పార్క్ 50, టెక్నో స్పార్క్ గో 3, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ 5జీ, మోటోరోలా జీ06, నోవా 2 ప్రో 5జీ తదితర మోడళ్లపై కూడా ఆఫర్లు ఉండనున్నాయి. అందుకే, కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై సెప్టెంబర్ 24 నుంచి ఎర్లీ-బర్డ్ డీల్స్ ప్రారంభం కానున్నాయి. ధరలు, స్టాక్, బ్యాంక్ ఆఫర్లు మోడల్‌ను బట్టి మారే అవకాశం ఉంది.
