Flipkart Big Billion Days Sale : మైండ్ బ్లోయింగ్ డీల్స్.. ఈ శాంసంగ్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే?

Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అధికారికంగా వచ్చే అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందబాటులో ఉన్నాయి..

  • Published on- September 21, 2026 / 03:35 PM IST

Flipkart Big Billion Days Sale 2026

  • అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
  • శాంసంగ్ గెలాక్సీ S25 రూ. 60వేల లోపు ధరకే
  • శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ రూ. 59,999 ప్రారంభ ధర
  • అక్టోబర్ 1 నుంచి ఆఫర్లు, డిస్కౌంట్ల ధరలు వెల్లడి

Flipkart Big Billion Days Sale 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ అక్టోబర్ 9, 2026న ప్రారంభం కానుంది. అంతకన్నా ముందుగానే అక్టోబర్ 8, 2026న ఎర్లీ యాక్సెస్ షెడ్యూల్ అయింది. ఈ సేల్ ప్రారంభానికి ముందు డీల్ ఫ్లిప్‌కార్ట్ గత ఏడాది నాటి రెండు ప్రీమియం శాంసంగ్ ఫోన్‌ల ధరలను టీజ్ చేసింది.

గత ఏడాది బీబీడీలో కూడా ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ S24 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. అయితే, మెమరీ కొరత కారణంగా (Flipkart Big Billion Days Sale) పెరిగిన ధరలు ఇతర కారణాల వల్ల ఈసారి డిస్కౌంట్లు అంత భారీగా లేవు. ఈ ఫోన్ల ధరలు తగ్గింపు ధరకు కొనాలా వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ S25 ధర ఎంత? :
ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ కేటగిరీలో అధికారిక బ్యానర్ ప్రకారం.. ఆఫర్లతో సహా శాంసంగ్ గెలాక్సీ S25 రూ. 60వేల లోపు ధరకే లభిస్తుంది. ఎంపిక చేసిన యాక్సిస్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ధరలో 10 శాతం తగ్గింపు కూడా ఉండే అవకాశం ఉంది. జనవరి 2025లో గెలాక్సీ S25 రూ. 80,999 ప్రారంభ ధరతో విడుదలైంది.

Read Also : Ai Plus Nova 2 Power 5G : సూపర్ ఫీచర్లు బ్రో.. కొత్త ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5G అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?

S25 ఎఫ్ఈ ధర ఎంతంటే? :

బ్యాంకు డిస్కౌంట్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర రూ. 50వేల కన్నా తక్కువకు రానుంది. అదనపు సేవింగ్స్ కోసం కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ల కొనుగోలుపై ఈఎంఐ ఆఫర్లను కూడా ప్రకటించింది.

సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ రూ. 59,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ S25, S25 ఎఫ్ఈ కచ్చితమైన ఆఫర్ ధరలు 2026 అక్టోబర్ 1న వెల్లడి కానున్నాయి.

గెలాక్సీ S25 ఎఫ్ఈ కొనాలా? :
రూ. 50వేల నుంచి రూ. 60వేల లోపు ధరలో కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తున్నవారికి శాంసంగ్ గెలాక్సీ S25 అద్భుతమైన ఆప్షన్. చిన్న బ్యాటరీ మినహా ఈ ఫోన్‌లో పెద్దగా మార్పుల్లేవు. ఇందులో ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్, 50MP + 10MP + 12MP కెమెరా సెటప్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. లాంచ్ సమయంలో కంపెనీ ఏడు ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఫ్యాన్ ఎడిషన్ విషయానికి వస్తే..
అమోల్డ్ స్క్రీన్, ట్రిపుల్ కెమెరా సెటప్, పర్ఫార్మెన్స్, గుడ్ బ్యాటరీ లైఫ్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వన్ యూఐ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్రీమియం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి శాంసంగ్ S25 ఎఫ్ఈ అద్భుతమైన ఆప్షన్.