Flipkart Big Billion Days Sale Date Revealed, iPhone 13 and iPhone 12 to get discounted
Flipkart Big Billion Days Sale Date : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే నిజంగా ఇది మీకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 12 (iPhone 12) ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీ (Flipkart Big Billion Days Sale Date) అధికారికంగా వెల్లడించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై.. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 22న ముందుగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) వినియోగదారుల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్ డీల్ (Big Billion Days Deals) ప్రారంభమవుతాయి.
Flipkart Big Billion Days Sale Date Revealed, iPhone 13 and iPhone 12 to get discounted
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale Date)గా కూడా అదే సమయం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కూడా సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం.. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్లు, అంతకంటే ఎక్కువ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. ICICI, యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ కూడా మరిన్ని డీల్స్‌ను అందించనున్నట్టు వెల్లడించింది. ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. అందులో iPhone 12, iPhone 11, iPhone 13 సిరీస్‌లతో సహా మోడల్స్‌పై డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Flipkart Big Billion Days Sale Date Revealed, iPhone 13 and iPhone 12 to get discounted
అయితే, ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇంకా ఆఫర్ ధరలను వెల్లడించలేదు. కానీ, ఈ ఐఫోన్ మోడల్‌లు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాదు.. Motorola, Samsung, Realme, Poco వంటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని కొన్ని డీల్‌లు Poco F4 5G, Poco X4 5G, Poco M4 Pro 5G, Oppo Reno 8 5G, Motorola Edge 30, Moto G62, Moto G32, Realme 9i 5G, Realme 9 5G స్పెషల్ ఎడిషన్ వంటి మరిన్ని స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
Flipkart Big Billion Days Sale Date Revealed, iPhone 13 and iPhone 12 to get discounted
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale Date) కూడా సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లు (Amazon Prime Users) అన్ని డీల్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ సేల్ సమయంలో Amazon కొన్ని iPhone మోడల్స్‌తో పాటు Samsung, Xiaomi, Redmi, iQOO, Vivo వంటి అనేక ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఐఫోన్ మోడల్‌లపై భారీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 13 (iPhone 13 Deals) డీల్‌పై రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. అందులోనూ ఫెస్టివల్ సేల్ సమయంలో iPhone 13 తగ్గింపు ధర సుమారు రూ. 45,000 వరకు తగ్గవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల iPhone 13పై తగ్గింపు తర్వాత అధికారికంగా రూ. 69,900 వద్ద అందుబాటులో ఉంది.