Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. అతి తక్కువ ధరకే ఐఫోన్, శాంసంగ్, నథింగ్, మోటో, వివో ఫోన్లు.. డోంట్ మిస్..!
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఐఫోన్ 16e, శాంసంగ్ గెలాక్సీ S24, నథింగ్ ఫోన్ 3a ఫోన్లపై డిస్కౌంట్లు పొందవచ్చు.

Flipkart Freedom Sale
Flipkart Freedom Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు తెగ ఊరిస్తున్నాయి. అమెజాన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ కూడా కొత్త ఫ్రీడమ్ సేల్‌ను (Flipkart Freedom Sale) ప్రారంభించింది. ఈ సేల్ సందర్భంగా ఆపిల్, శాంసంగ్, నథింగ్, రియల్‌మి, వివో, మోటోరోలా వంటి బ్రాండ్‌ల నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ సేల్ VIP, ప్లస్ సభ్యులకు అర్ధరాత్రి ప్రారంభమైంది. సాధారణ యూజర్లకు ఆగస్టు 1 నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ అద్భుతమైన సేల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో 8 రోజుల పాటు కొనసాగనుంది. అయితే, సేల్ మరింత పొడిగించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్‌లను ఓసారి పరిశీలిద్దాం.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు ఏంటి? :
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ అధికారికంగా వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో కొనుగోళ్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై కూడా వర్తిస్తుంది.
ఈ బ్యాంక్ ఆఫర్‌లతో పాటు వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. అదనపు సేవింగ్స్ కోసం సూపర్ కాయిన్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.
ఈ సేల్ సమయంలో అనేక ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి (Flipkart Freedom Sale).
- ఐఫోన్ 16 లాంచ్ ధర రూ. 79,900 నుంచి తగ్గి రూ. 69,999 ధరకు లభ్యమవుతుంది.
- మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ ధర రూ.25,999 నుంచి రూ.20,999కి తగ్గింది.
- శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ అసలు ధర రూ.59,999 నుంచి తగ్గి కేవలం రూ.35,999కే లభ్యమవుతుంది.
- శాంసంగ్ గెలాక్సీ S24 లాంచ్ ధర రూ.74,999 నుంచి తగ్గి ఇప్పుడు రూ.46,999కి అందుబాటులో ఉంది.
- ఐఫోన్ 16e లాంచ్ ధర రూ.59,900 నుంచి తగ్గి రూ.54,900కి లభ్యమవుతుంది.
- నథింగ్ ఫోన్ 3a లాంచ్ ధర రూ.27,999 నుంచి తగ్గింపుతో రూ.21,999కి అందుబాటులో ఉంది.
- వివో T4 5G ఫోన్ లాంచ్ ధర రూ.21,999 నుంచి తగ్గింది. రూ.20,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.