Amazon Freedom Sale : అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R సహా 5 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో శాంసంగ్, ఐక్యూ, ఐఫోన్, షావోమీ వంటి బ్రాండ్ల నుంచి తగ్గింపు ధరలకు పొందవచ్చు.

Amazon Freedom Sale
Amazon Freedom Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో ఆసక్తిగల (Amazon Freedom Sale) కొనుగోలుదారులు అనేక ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మీరు OnePlus, Samsung, Apple, Xiaomi, iQOO నుంచి ఫోన్లను లాంచ్ రేట్ల కన్నా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా, రక్షా బంధన్ కోసం కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమై ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్ ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పుడు కేవలం రూ.79,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు లాంచ్ ధర రూ.1,34,999 కన్నా సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 :
ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ రూ. 58వేల తగ్గింపు ధరకు పొందవచ్చు. ఈ ఐఫోన్ మొదట 2023లో రూ. 79,900కు లాంచ్ అయింది. గత ధర తగ్గింపు తర్వాత కూడా రూ. 69,900కు తగ్గింది. ఈ ప్రస్తుత ఆఫర్ ఆపిల్ ఔత్సాహికులకు మరింత ఆకర్షణీయమైనదిగా చెప్పవచ్చు.
వన్‌ప్లస్ 13R :
వన్‌ప్లస్ 13R ఫోన్ (Amazon Freedom Sale) ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రూ.42,999 నుంచి భారీగా తగ్గింది. ప్రారంభ ధర రూ.36,999కు పొందవచ్చు.
ఐక్యూ Z10R :
ఇటీవలే లాంచ్ అయిన ఐక్యూ Z10R కేవలం రూ. 18,499 ప్రారంభ ధరకే కొనేసుకోవచ్చు. అసలు ధర రూ. 23,499 కన్నా భారీగా తగ్గింపు పొందవచ్చు. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో డీల్‌ను పొందవచ్చు.
రెడ్‌మి నోట్ 13 ప్రో :
రెడ్‌మి నోట్ 13 ప్రోపై రూ.5వేలు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు రూ.23,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మొదట రూ.28,999కి లాంచ్ అయింది. రూ.1,000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.