Samsung Phones Offer : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

Samsung Phones Offer : శాంసంగ్ ఫోన్లపై ఖతర్నాక్ ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Samsung Phones Offer : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

Samsung Phones Offer

Updated On : August 2, 2025 / 1:25 PM IST

Samsung Phones Offer : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్లు.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త సేల్స్ (Samsung Phones Offer) ప్రారంభమయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అధికారికంగా సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్ ప్రధానంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S24, గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24 FE ఫోన్ల ధరలపై దాదాపు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ భారీ డిస్కౌంట్‌లతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. పవర్‌ఫుల్ 200MP కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఈ సేల్‌లో రూ.80వేల లోపు ధరకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE :
మీరు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.35,999 ప్రారంభ ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 FE పొందవచ్చు. లాంచ్ ధర రూ.59,999 కన్నా చాలా తక్కువ. ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫీచర్ పరంగా 4,700mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్, 10MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.

Read Also : PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత విడుదల.. మీ అకౌంట్లో రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలంటే?

శాంసంగ్ గెలాక్సీ S24 :
ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర కూడా భారీగా తగ్గింది. కేవలం రూ.46,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ మొదట రూ.74,999కి లాంచ్ అయింది. లాంచ్ ధర కన్నా రూ.28వేల వరకు తక్కువ ధరకు లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 2 స్టోరేజ్ (8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB) వేరియంట్‌లలో వస్తుంది. 4000mAh బ్యాటరీ కలిగి ఉంది. 50MP మెయిన్ సెన్సార్, 10MP, 12MP కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా దాదాపు సగం ధరకే వస్తుంది. ఈ ప్రీమియం శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ.79,999 నుంచి లభ్యమవుతుంది. లాంచ్ ధర రూ.1,34,999 నుంచి భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.2,399 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది.