Free Netflix Subscription : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Free Netflix Subscription : 30 రోజులు ముగిసిన తర్వాత ఈ బెనిఫిట్ మళ్లీ పొందాలంటే కస్టమర్ నెక్ట్స్ క్యాలెండర్ నెలలో మళ్లీ 4 ఆర్డర్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Free Netflix Subscription

  • ఈ-కామర్స్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది
  • ఆర్డర్‌లు కేవలం ఫ్లిప్‌కార్ట్, గ్రోసరీ, మినిట్స్ ద్వారా మాత్రమే
  • అర్హులైన కస్టమర్లు ఆగస్టు 1 నుంచి ఈ బెనిఫిట్ పొందవచ్చు

Free Netflix Subscription : ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు పండగే.. ఇకపై షాపింగ్ చేసేవారు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏదైనా ఆర్డర్ చేస్తే చాలు.. నెల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ఈ ఆర్డర్‌లను కంపెనీకి చెందిన 3 సర్వీసులైన ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ, లేదా ఫ్లిప్‌కార్ట్ (Free Netflix Subscription) మినిట్స్‌లో ఎందులో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంతకీ, ఏయే కస్టమర్లు ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ పొందుతారు? ఎన్ని ఆర్డర్‌లు చేస్తే ఈ బెనిఫిట్ అర్హత పొందుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ పొందే ఛాన్స్ అందిస్తోంది. అర్హులైన కస్టమర్లు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ ఆఫర్‌ పొందవచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అవసరమైన కొనుగోళ్లతో ప్రతి నెలా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌ పొందవచ్చు.

Read Also : MG Hector Plus SUV : లగ్జరీ లుక్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ SUV ఎంట్రీ.. ఫీచర్లు, మైలేజీ ఎంతంటే?

ఈ-కామర్స్ సంస్థ లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా స్ట్రీమింగ్ బెనిఫిట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ లేదా రీఛార్జ్ కోసం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు.

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌కు ఎన్ని ఆర్డర్లు అవసరం :
ఈ ప్లాన్ ఆగస్టు 1 నుంచి ఫ్లిప్‌కార్ట్ సభ్యుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు క్యాలెండర్ నెలలోపు ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో కనీసం రూ. 299 విలువైన 4 ఆర్డర్‌లను పూర్తి చేయాలి. నాల్గో అర్హత గల ఆర్డర్ చేయగానే వినియోగదారులు ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా నేరుగా ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా 30-రోజుల నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌ యాక్టివేట్ చేసుకోవచ్చు.

30 రోజుల తర్వాత మళ్లీ ఫ్రీ ప్లాన్‌ ఎలా? :
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ మొబైల్ ప్లాన్ యూజర్లకు 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 30 రోజుల తర్వాత ఈ బెనిఫిట్ మళ్లీ పొందాలంటే తర్వాతి క్యాలెండర్ నెలలో 4 ఆర్డర్‌లను పూర్తి చేయాలి. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ కిరాణా, క్విక్ కామర్స్ సర్వీసులతో సహా అన్నింట్లో పొందవచ్చు.