Vivo V30 Pro 5G
Flipkart Sale 2025 : కొత్త వివో ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. వివో ఫ్యాన్స్ కోసం వివో V30 ప్రో 5జీ ఫోన్ తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు వివో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ వివో V30 ప్రో 5G భారీ డిస్కౌంట్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్పెషల్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ కారణంగా 50MP సెల్ఫీ కెమెరా సరసమైన ధరకే లభిస్తోంది. సెల్ఫీ కెమెరాల స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఫ్రంట్ కెమెరాతో వివో V30 ప్రో 5G తగ్గింపు ధరకే లభిస్తోంది.
ఈ గాడ్జెట్‌లో స్టూడియో-క్యాలిబర్ ఆరా లైట్, ZEISS ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ (Flipkart Sale 2025) కెమెరా ఉన్నాయి. 2024లో లాంచ్ కాగా కంపెనీ వివో V30 ప్రో 5Gని భారత మార్కెట్లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రిలీజ్ చేసింది. కేవలం 0.745 సెం.మీ మందం, హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉంది. స్ట్రాంగ్ మీడియాటెక్ ప్రాసెసర్ కలిగి ఉంది. వర్చువల్ ర్యామ్ కూడా సపోర్టు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.
వివో ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V30 ప్రో 5G ఫోన్ రూ.41,999కు అందిస్తోంది. 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ మోడల్ కలిగి ఉంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 3,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ వివో ఫోన్ ఇప్పుడు రూ. 38,499కు మాత్రమే కొనేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు కాకుండా కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఎంచుకోవచ్చు. వివో పాత ఫోన్‌పై రూ. 40వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. కొన్ని మోడళ్లలో రూ. 4,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. పాత ఫోన్ మోడల్, వర్కింగ్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, క్లాసిక్ బ్లాక్, అండమాన్ బ్లూ రెండూ ఫోన్‌కు కలర్ ఆప్షన్లతో వస్తుంది.
వివో V30 ప్రో 5G ఫీచర్లు :
వివో V30 ప్రో 5G ఫోన్ HDR10+ కస్టమైజడ్ 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌సెట్‌తో 512GB స్టోరేజీ, 12GB వరకు ర్యామ్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరాతో పాటు, బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫన్‌టచ్OS 14తో రన్ అయ్యే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 80W వద్ద ఛార్జ్ చేయవచ్చు.