Essentials Price Hike: సామాన్యుడిపై మరో భారం.. భారీగా పెరుగనున్న సబ్బులు, నూనెల ధరలు.. FMCG కంపెనీల సంచలన నిర్ణయం

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్, ముడిసరుకుల ధరల(Essentials Price Hike) ప్రభావంతో త్వరలోనే సబ్బులు, వంటనూనెలు, టెలిఫోన్ బిల్లుల ఛార్జీలు పెరగనున్నాయి.

Fmcg companies plan price hike on soaps edible oil and mobile tariffs due to crude oil rise

Essentials Price Hike: ఇప్పటికే బియ్యం, పప్పులు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది. త్వరలోనే రోజువారీ వినియోగ ఉత్పత్తులైన సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సరుకుల సరఫరా, ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు పలు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (Essentials Price Hike) కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Lula Da Silva: బ్రెజిల్ ఎన్నికల్లో లూలా డా సిల్వా ఘనవిజయం.. 44 లక్షల మెజారిటీ.. మరోసారి అధ్యక్ష పీఠం కైవసం!

పెరుగుతున్న అంతర్జాతీయ ముడిచమురు, వర్షాభావ ప్రభావం.. ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నిర్ణయం:

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 113 డాలర్లకు చేరడంతో ఉత్పత్తుల తయారీ, రవాణా వ్యయాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు ముడిసరుకుల ధరలు 74 శాతం వరకు పెరగడం, తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పంట దిగుబడులు తగ్గడం వ్యాపారాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపాయి. క్రైసిల్, ఎలరా క్యాపిటల్, కొటక్ నియో వంటి ఆర్థిక విశ్లేషణ సంస్థలు కంపెనీల ఉత్పత్తి వ్యయాలు పెరిగినందున ఈ భారాలు వినియోగదారులపై పడక తప్పదని స్పష్టం చేశాయి.

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు.. టెలికాం రంగంలోనూ పెంపు అంచనా:

కేవలం ఎఫ్‌ఎంసీజీ వస్తువులే కాకుండా టెలికాం రంగంలో కూడా ధరల పెంపు సూచనలు కనిపిస్తున్నాయి. అంబిత్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, రాబోయే డిసెంబర్ నాటికి ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్, టెలిఫోన్ బిల్లులను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు నిత్యావసర వస్తువులు, మరోవైపు రవాణా, కమ్యూనికేషన్ ఛార్జీలు ఒకేసారి పెరగనుండటం మధ్యతరగతి, పేద ప్రజల జేబులకు మరింత చిల్లు పెట్టనుంది.