Honda Outlier EV : పెట్రోల్ బైక్‌లకు బైబై.. ఇక ఫ్యూచర్ ఇదే.. హోండా కొత్త Outlier EV చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Honda Outlier EV : పెట్రోల్ బైక్‌లకు భిన్నంగా హోండా Outlier EV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇన్-వీల్ మోటార్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్పెషల్ రైడింగ్ పొజిషన్‌తో ఈవీ ఎందుకు స్పెషల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Honda Outlier EV

  • హోండా ఔట్‌లియర్ EV స్పెషాలిటీ ఇదే
  • కొత్త Outlier ఈవీ కాన్సెప్ట్ అదుర్స్ 
  • భవిష్యత్తుకు హోండా ఇచ్చిన సిగ్నల్ 

Honda Outlier EV : పెట్రోల్ బైకులను ఇక మర్చిపోవాల్సిందేనా? రాబోయే రోజుల్లో సరికొత్త బైకులు రాబోతున్నాయా? పెట్రోల్ బైకులకు ఇక బైబై చెప్పాల్సిన టైమ్ వచ్చిందా? అంటే హోండా (Honda) కంపెనీ అవుననే అంటోంది. భవిష్యత్తు బైకులు ఇప్పటిలా ఉండవని అంటోంది. అసలు పెట్రోల్ బైక్ అంటే ఇంజిన్, గేర్‌బాక్స్, ట్యాంక్, వీల్స్.. ఇదే మనకు తెలిసింది.. కానీ, భవిష్యత్తులో బైక్‌లు ఇలాగే ఉండవని చెబుతోంది హోండా.

అందుకు ఉదాహరణే.. Outlier EV కాన్సెప్ట్. పూర్తిగా డిఫరెంట్ డిజైన్‌తో ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రాబోతుంది. రానున్న రోజుల్లో టూవీలర్ సెక్టార్ (Honda Outlier EV) ఎలా మారబోతుందో హోండా ఈ కాన్సెప్ట్ ద్వారా జస్ట్ ఒక ట్రైలర్ వదిలింది అంతే.. ఇంతకీ ఔట్లేయర్ ఈవీ కాన్సెప్ట్ ఏంటి? పెట్రోల్ బైకులకు దీనికి తేడా ఏంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Outlier EV అసలేంటి? :

హోండా రూపొందించిన ఈ Outlier EV ప్రస్తుతం ఒక కాన్సెప్ట్ మోడల్ మాత్రమే. అంటే.. వెంటనే షోరూమ్‌లోకి వచ్చే ప్రొడక్షన్ బైక్ కాదు. భవిష్యత్ మోటార్‌సైకిళ్ల కోసం హోండా ప్రవేశపెట్టబోతున్న డిజైన్, టెక్నాలజీ, రైడింగ్ కాన్సెప్ట్‌ను చూపించే ఎక్సర్‌మెంటల్ మోడల్.

Read Also : TVS iQube MillionR : ఒక్క ఛార్జ్‌తో 145 కి.మీ రేంజ్‌.. TVS కొత్త ఈ-స్కూటర్ అదిరిపోయిందిగా! ధర ఎంతంటే?

పెట్రోల్ బైక్‌లతో తేడా ఏంటి? :

అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సాధారణ పెట్రోల్ బైక్‌లో భారీ ఇంజిన్, గేర్‌బాక్స్, డ్రైవ్ సిస్టమ్ కోసం చాలా స్పేస్ అవసరం. కానీ, ఔట్లయర్ ఈవీలో అలాంటి ట్రెడిషనల్ సెటప్ కనిపించదు. ఇందులో ఫ్రంట్, బ్యాక్ చక్రాల్లోనే ఇన్-వీల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉండేలా కాన్సెప్ట్ చేశారు. తద్వారా బైక్ నిర్మాణం పూర్తిగా రైడర్లను ప్రత్యేకంగా అనిపిస్తుంది.

స్పెషాలిటీ ఏంటి? :
రైడింగ్ పొజిషన్ చాలా తక్కువ ఎత్తు ఉంటుంది. లాంగ్ షేప్, భారీ బాడీ డిజైన్ చూస్తుంటే ఈ బైక్‌ సాధారణ బైకుల కన్నా చాలా కొత్తగా ఉంటుంది. రైడర్‌కు ఈ బైకుపై వెళ్లే సమయంలో రోడ్డు, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మరింత స్పెషల్ అనిపించేలా ఈ మోడల్ రూపొందించినట్లు హోండా చెబుతోంది.

అయితే,  ఈ మోడల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో హోండా రివీల్ చేయలేదు. కానీ, ఒక్కటి మాత్రం క్లారిటీ ఇచ్చింది.. ఈవీ అంటే కేవలం పెట్రోల్ ఇంజిన్‌ ప్లేసులో బ్యాటరీ పెట్టడం మాత్రమే కాదు. మొత్తం బైక్ రూపాన్నే మార్చేయనుంది. Outlier ఈవీ అనేది రాబోయే భవిష్యత్తుకు జస్ట్ ట్రైలర్‌లా కనిపిస్తోంది.