UPI Payment Rules: యూపీఐ పేమెంట్స్‌పై కొత్త రూల్స్.. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళన.. మళ్ళీ పాత పద్దతే దిక్కా!
NPCI ఇటీవల ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ లావాదేవీల(UPI Payment Rules) నిబంధనలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- September 19, 2026 / 04:12 PM IST
Gas distributors concerned over new UPI payment rules.
UPI Payment Rules: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ లావాదేవీల నిబంధనలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ప్రతిపాదిత మర్చంట్ లావాదేవీలపై రూ. 5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (UPI Payment Rules) విధించే ప్రతిపాదన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను కలవరపెడుతోంది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, డెలివరీ సమయాల్లో చేసే యూపీఐ (UPI) లావాదేవీల వద్ద ఈ కొత్త ఛార్జీల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ప్రస్తుతం వినియోగదారుల్లో, ఏజెన్సీలలో గందరగోళం నెలకొంది.
Srikakulam Bus Fire Accident: శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. నరసన్నపేట వద్ద ప్రైవేట్ బస్సు దగ్ధం
డెలివరీ సిబ్బంది వ్యక్తిగత ఖాతాలే శాపం.. అదనపు భారం పడే అవకాశం:
రూ. 2,500 కంటే ఎక్కువ ధర ఉండే 19 కేజీల కమర్షియల్ సిలిండర్లపై ఈ ఛార్జీ వర్తిస్తుండగా, గృహావసర 14.2 కేజీల సిలిండర్ల విషయంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఏజెన్సీలలో ప్రతి ఉద్యోగికి ప్రత్యేకం క్యూఆర్ కోడ్ లేకపోవడంతో, డెలివరీ బాయ్స్ వ్యక్తిగత యూపీఐ ఖాతాల ద్వారా డబ్బులు సేకరిస్తున్నారు. సాయంత్రానికి ఈ మొత్తాన్ని ఏకమొత్తంగా ఏజెన్సీ ఖాతాకు రూ. 2,000 దాటి బదిలీ చేస్తున్నందున ఇది ఎండీఆర్ పరిధిలోకి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఇది చివరకు వినియోగదారులపై అదనపు భారంగా మారే ముప్పు ఉంది.
మినహాయింపు కోరుతున్న ఏజెన్సీలు.. క్రమంగా పెరుగుతున్న పన్ను వసూళ్లు:
ఈ విచిత్ర పరిస్థితి వల్ల గ్యాస్ ఏజెన్సీలు తిరిగి డిజిటల్ మోడ్ నుంచి నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్ల ఎల్‌పిజి పంపిణీ రంగాన్ని ఎండీఆర్ ఛార్జీల పరిధి నుంచి పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వం ముందు విజ్ఞప్తి చేసేందుకు రంగానికి చెందిన ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. మరోవైపు క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంధన ధరల్లో మార్పు లేకపోగా, దేశంలో పత్యక్ష పన్ను వసూళ్లు పెరుగుతుండటం గమనార్హం.
