×
Ad

Maruti Celerio : 2025లో ఈ కారుపై లాస్ట్ బిగ్ డీల్.. 34 కి.మీ మైలేజ్, జస్ట్ రూ. 4.69 లక్షలే.. ఇప్పుడే కొంటే ఏకంగా రూ. 52,500 తగ్గింపు..!

Maruti Celerio Discount : మారుతి సెలెరియోపై బిగ్ డీల్.. ఇయర్ ఎండ్ డీల్ కింద లాస్ట్ బిగ్ డీల్ అందిస్తోంది. ఈ డిసెంబర్‌లో మారుతి కారును అతి చవకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..

1/5
Maruti Celerio Discount : మారుతి సుజుకి కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త మారుతి కారు కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. తక్కువ బడ్జెట్‌లో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం మారుతి సెలెరియోపై బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఎందుకంటే కంపెనీ ప్రస్తుతం ఈ సెలెరియో కారుపై ఏకంగా రూ.52,500 తగ్గింపును అందిస్తోంది. మీ బడ్జెట్‌కు తగిన తగ్గింపు అని చెప్పొచ్చు. ఈ మారుతి కారు రోజువారీ నగర ప్రయాణాలకు చాలా బెస్ట్.
2/5
ఈ డిసెంబర్‌లో మైలేజ్-ఫ్రెండ్లీ, బడ్జెట్-ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ కొనాలని చూస్తుంటే మారుతి సుజుకి సెలెరియో కొనేసుకోవడమే బెటర్. ఈ నెలలో కంపెనీ పాపులర్ సెలెరియోపై రూ. 52,500 వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. ఈ పూర్తి బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/5
అన్ని వేరియంట్లపై రూ. 52,500 బెనిఫిట్స్ : మారుతి అన్ని సెలెరియో వేరియంట్లలో (LXi నుంచి ZXi+ వరకు) ఒకే మాదిరి ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 25వేలు క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. అంటే.. రూ. 25,000 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, మీరు రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. మీ పాత కారుతో ఎక్స్చేంజ్ చేసుకుంటే అదనంగా రూ. 15,000 తగ్గింపు లేదా రూ. 25,000 స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. మీ పాత కారును స్క్రాప్ చేస్తే.. ఈ బోనస్ రూ. 15వేలకి బదులుగా రూ. 25వేలకు పెరుగుతుంది.
4/5
అదనంగా, రూ. 2,500 వరకు అదనపు ఆఫర్లు ఉన్నాయి. కొన్ని డీలర్-లెవల్ బెనిఫిట్స్ చిన్న ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ సేవింగ్స్ రూ.52,500 వరకు ఉంటాయి. మారుతి సెలెరియో ధరలు రూ. 4.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 6.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ ధరల రేంజ్‌లో సెలెరియో భారత మార్కెట్లో అత్యంత సరసమైన మైలేజ్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా చెప్పొచ్చు.
5/5
మారుతి సెలెరియో బెస్ట్ బడ్జెట్ కారు? : మారుతి సెలెరియో ఫీచర్లలో AMT (ఆటో గేర్ షిఫ్ట్) ఆప్షన్ ఉంది. ట్రాఫిక్‌లో ఈజీగా ఫ్యూయిల్ కెపాసిటీని అందిస్తుంది. డ్యూయల్‌జెట్ 1.0L K-సిరీస్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. అద్భుతమైన ఫ్యూయిల్ కెపాసిటీని అందిస్తుంది. 6-ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్లతో కూడా వస్తుంది. చాలా తేలికైనది.. కాంపాక్ట్ కారుతో సిటీ మొత్తం చుట్టేయొచ్చు..