Gold Rate Today: బంగారం ధరల్లో భారీ మార్పులు.. యూటర్న్ తీసుకున్న గోల్డ్.. హైదరాబాద్ లో తులం రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
- Harishth Thanniru
- Published On : April 16, 2025 / 11:05 AM IST
Gold Rate
Gold Rate Today: బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. సోమ, మంగళవారాల్లో బంగారం ధర తగ్గుతూ వచ్చింది. రెండు రోజుల్లో 10గ్రాముల గోల్డ్ పై సుమారు రూ. 500 తగ్గింది. అయితే, బుధవారం మాత్రం గోల్డ్ రేట్లు షాకిచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మారకపు విలువ క్షీణిస్తోంది. డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు ఇవాళ భారీగా పెరుగుదలను చూస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (31.10గ్రాముల) బంగారం 3,289 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు ఔన్స్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగింది. 32.49 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.
భారతదేశంలో ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 990 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.950 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.88,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.96,170కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.96,320కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 88,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.96,170 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000 కు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.
