Gold Rate: సీన్ రివర్స్.. గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10గ్రాముల బంగారం ధర ఎంతుందంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : July 18, 2025 / 11:30 AM IST
Gold Rate Today
Gold Rate: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి బ్యాడ్ న్యూస్. గోల్డ్ రేటు మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.50 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 50 పెరిగింది. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ ఆరు డాలర్లు తగ్గి.. ప్రస్తుతం 3,335 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు.. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.91,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 99,380కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,200కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 99,530కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.91,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 99,380కు చేరింది
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,23,900 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,13,900 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,23,900 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
