Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harish Thanniru
- Updated on- January 20, 2025 / 11:42 AM IST
Gold
Gold Rate Today: దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. గత పదిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర.. సోమవారం కూడా స్వల్పంగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 120 పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలాఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో..
22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,500.
10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.81,230
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
ఢిల్లీ: 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,650
24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 81,380.
ముంబయి కోల్ కతా, బెంగళూరు నగరాల్లో :
22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.74,500.
24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.81,230
చెన్నై: 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,500.
24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 81,230.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా సోమవారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,04,100 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
చెన్నై: కిలో వెండి ధర రూ. 1,04,100.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో: కిలో వెండి ధర రూ. 96,500.
బెంగళూరు : కిలో వెండి ధర రూ. 96,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
