God Rates: ఆహా.. బంగారం ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా ఐదోరోజు తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో అయితే..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : March 25, 2025 / 10:44 AM IST
Gold Rates
Gold And Silver Price: బంగారం కొనేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు ఈ వార్త తెలిస్తే ఎగిరిగంతేయడం ఖాయం. ఎందుకంటే గోల్డ్ ధరలు వేగంగా దిగొస్తున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతోపాటు.. రాబోయే కాలంలోనూ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర భారీగా తగ్గింది. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.330 తగ్గింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో 24క్యారట్ల బంగారంపై రూ. 1,370 తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా దిగొస్తుంది.
గత కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో గత ఐదు రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,015కి దిగొచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 33 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.81,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,290కి దిగొచ్చింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,440 కు దిగొచ్చింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 81,850 కాగా.. 24క్యారెట్ల ధర రూ.89,290 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000గా నమోదైంది.
