Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా.. 10గ్రాముల గోల్డ్ పై ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : March 30, 2025 / 07:45 AM IST
Gold
Gold And Silver Price: ఉగాది పండుగ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. బగారం ధర పెరిగింది. ఫలితంగా 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు మళ్లీ రూ.91వేల మార్క్ ను దాటేసింది.
అతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,085 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతుండగా.. స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 34 డాలర్ల దాటి ట్రేడింగ్ అవుతోంది. అయితే, భారతదేశంలో ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.91,200కు చేరగా.. కిలో వెండి రేటు రూ.1,13,000 వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.83,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.91,200 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.91,350 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 83,600 కాగా.. 24క్యారెట్ల ధర రూ.91,200 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,13,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,04,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,13,000 వద్ద కొనసాగుతుంది.
