Gold Rate: హెచ్ఎంపీవీ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : January 7, 2025 / 10:49 AM IST
Gold
Gold And Silver Price: చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారతదేశంలోనూ ఈ వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. దీంతో బంగారం, వెండి ధరలపైనా ప్రభావం పడింది. దీంతో గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంది. ఇక వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,150 వద్ద కొనసాగుతుండగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.78,710 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 78,860.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.72,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.78,710.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,150 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 78,710 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా మంగళవారం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,00,000కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,00,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
