హమ్మయ్య బంగారం ధర దూకుడుకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
- Harishth Thanniru
- Published On : March 11, 2024 / 11:17 AM IST
Gold price
Gold And Silver Price Today : ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు రెండు రోజులుగా బ్రేక్ పడింది. ఆదివారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. సోమవారం కూడా స్థిరంగా కొనసాగుతుంది. రెండు రోజుల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.. దీంతో గత పదిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలతో బెంబేలెత్తిపోతున్న కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి స్వల్పంగా తగ్గింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,270 వద్ద కొనసాగుతుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 66,420.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,750 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,270.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,500 మార్క్ కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.67,100గా నమోదైంది.
- తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాలను ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.79,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 79,100 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.75,600 కాగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,900 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
