తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
- Harishth Thanniru
- Published On : February 12, 2024 / 07:03 AM IST
Gold
Gold And Silver Price : బంగారం ఇష్టపడని వారు ఉండరు. తాజాగా పెండ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో గోల్డ్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గత మూడు రోజులుగా తులం బంగారంపై రూ. 300 తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 తగ్గింది. వెండి ధరకూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,840 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,090 వద్దకు చేరింది.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,690 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతుంది.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,290 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,590 వద్దకు చేరింది.
- తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,400 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,400కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.74,900కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,150 వద్ద కొనసాగుతోంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
