Gold Rate : హమ్మయ్య.. బంగారం ధర తగ్గిందోచ్..! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published On : April 13, 2024 / 10:59 AM IST
Gold Price
Gold Rate in Hyderabad : బంగారం ధర దూకుడుకు కాస్త బ్రేక్ పడింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 760 తగ్గింది. దీంతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటుతో బెంబేలెత్తిపోతున్న బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగినట్లయింది. ముఖ్యంగా గత పదిరోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే.. భారీ పెరుగుదల చోటు చేసుకుంది. పది రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 3వేలు పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలుకు సాహసం చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా బంగారం ధర భారీగా తగ్గడంతో వారికి ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి ధరకూడా కాస్త తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 మార్క్ కు చేరింది. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,550 వద్ద కొనసాగుతుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,700.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,500 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,550.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,800 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,960.
- తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.89,000 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 89,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.85,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో మాత్రం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 86,250 వద్దకు చేరింది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
