దిగొస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ...
- Harishth Thanniru
- Published On : March 13, 2024 / 11:12 AM IST
Gold Price
Gold And Silver Price Today : ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు నాలుగు రోజులుగా దిగొస్తున్నాయి. నిన్న 10 గ్రాముల బంగారంపై రూ. 100 తగ్గగా.. ఇవాళ రూ. 420 తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వెండి ధర సైతం తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 78,500గా నమోదైంది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,350 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,840 వద్ద కొనసాగుతుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 65,990.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,350 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 65,840.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,100 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.66,650గా నమోదైంది.
- తగ్గిన వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండిధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాలను ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.78,500 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,500 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లోనూ కిలో వెండిపై రూ. 900 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,200 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,100 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
