పసిడి ప్రియులకు కాస్త ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published On : April 14, 2024 / 12:43 PM IST
Gold
Gold Rate in Hyderabad : బంగారం ధర దూకుడుకు కాస్త బ్రేక్ పడింది. గత రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం బంగారం ధరల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకోగా.. ఆదివారం గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. .
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 మార్క్ కు చేరింది. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,550 వద్ద కొనసాగుతుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,700.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,500 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,550.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,800 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,960.
- స్థిరంగా వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.89,000 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 89,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.85,600కాగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 86,250 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
